Free COVID Vaccine in Delhi: అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్, 18 ఏళ్లు దాటిన వారందరికీ ఫ్రీగా ఇస్తామని ప్రకటించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, 1.34 కోట్ల డోసుల కొనుగోలుకు ప్రభుత్వం అమోదం
దేశ రాజధాని ఢిల్లీలో 18 ఏళ్లు దాటిన అందరికీ కొవిడ్-19 వ్యాక్సీన్లు ఉచితంగా (Free COVID Vaccine in Delhi) ఇవ్వనున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) ప్రకటించారు. దీనికోసం 1.34 కోట్ల డోసులను కొనుగోలుకు ప్రభుత్వం అమోదం తెలిపినట్టు ఆయన వెల్లడించారు.
New Delhi, April 26: దేశ రాజధాని ఢిల్లీలో 18 ఏళ్లు దాటిన అందరికీ కొవిడ్-19 వ్యాక్సీన్లు ఉచితంగా (Free COVID Vaccine in Delhi) ఇవ్వనున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) ప్రకటించారు. దీనికోసం 1.34 కోట్ల డోసులను కొనుగోలుకు ప్రభుత్వం అమోదం తెలిపినట్టు ఆయన వెల్లడించారు. వ్యాక్సీన్ కొనుగోలు, దాన్ని ప్రజలకు అందించే ప్రక్రియను సాధ్యమైనంత వేగంగా చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
కొవిడ్-19 వ్యాక్సీన్ల ధర అందరికీ సమానంగా ఉండాలనీ... ఈ ధరను కేంద్ర ప్రభుత్వం తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ధరలను తగ్గించాలంటూ వ్యాక్సీన్ తయారీదారులకు సైతం కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ఇది మానవత్వంతో సాయం చేయాల్సిన సమయమనీ... లాభాల కోసం చూసే సమయం కాదనీ ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే రాష్ట్రాలకు ఇచ్చే వ్యాక్సిన్‌ల ధరలను తగ్గించాలని కేజ్రీవాల్ తయారీదారులను కోరారు. డోసు రూ.150కే ఇవ్వాలని నేను కోరుతున్నాను. మీరు లాభాలు ఆర్జించడానికి మొత్తం జీవితకాలం ఉంది. కానీ ఇప్పుడు కరోనా విరుచుకుపడిన సమయంలో ఇలా చేయడం సరి కాదు. వ్యాక్సిన్ల ధరలపై పరిమితి విధించాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను అని కేజ్రీవాల్ అన్నారు.
ఒకరు రాష్ట్రాలకు రూ.400కు ఇస్తామని, మరొకరు రూ.600కు ఇస్తామన్నారు. కేంద్రానికి మాత్రం రూ.150 కే ఇస్తామంటున్నారు. అందరికీ ఒకే ధర ఉండాలి అని కేజ్రీవాల్ కోరారు. అయితే కేంద్రం మాత్రం ఇప్పటికే తయారీదారుల నుంచి రూ.150కి కొని వాటిని రాష్ట్రాలకు ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది.
(The above story first appeared on LatestLY on Apr 26, 2021 03:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

