Girls Ugly Fight Over Boyfriend: నా లవర్‌తో తిరుగుతావా? అంటూ జుట్లు పట్టుకొని కొట్టుకున్న ఇద్దరమ్మాయిలు, తన ప్రియుడితో కలిసి జాతరకు వచ్చిన యువతిని బట్టలు చింపి మరీ కొట్టిన యువతి

తన లవర్ తో తిరుగుతున్న అమ్మాయిపై యువతి దాడి చేసింది. జుట్టు పట్టుకుని లాగింది. కాళ్లతో తన్నింది. ఆమెకు ఫ్రెండ్స్ కూడా సాయపడ్డారు. నలుగురు అమ్మాయిలు కలిసి ఆ యువతిని దారుణంగా కొట్టారు. అమ్మాయిల దాడిలో బాధితురాలి దుస్తులు సైతం చిరిగిపోయాయి. అయినా వారు తగ్గలేదు. కొట్టుకోవడం ఆపలేదు.

Girls Ugly Fight Over Boyfriend: నా లవర్‌తో తిరుగుతావా? అంటూ జుట్లు పట్టుకొని కొట్టుకున్న ఇద్దరమ్మాయిలు, తన ప్రియుడితో కలిసి జాతరకు వచ్చిన యువతిని బట్టలు చింపి మరీ కొట్టిన యువతి
Girls Fight Over Boyfriend Screen Garb from viral video

Sonepur, NOV 30: బీహార్ లోని సోనేపూర్ లో (Sonepur) అమ్మాయిలు ఘర్షణ పడ్డారు. ఆరుగురు అమ్మాయిలు కొట్టుకున్నారు. కొట్టుకోవడం అంటే.. అలా ఇలా కాదు.. పొట్టు పొట్టు కొట్టుకున్నారు. దారుణంగా ఫైట్ చేశారు. జట్లు పట్టుకుని, కాళ్లతో మరీ తన్నుకున్నారు. దుస్తులు కూడా చింపుకున్నారు. ఇదంతా ఓ అబ్బాయి కోసం జరిగిన ఫైటింగ్ (Ugly Fight) కావడం షాక్ కి గురి చేసే అంశం. ఓ యువతి తన ఫ్రెండ్స్ తో కలిసి జాతరకు వచ్చింది. అదే సమయంలో జాతరలో ఆమెకు తన ప్రియుడు (Boyfriend) కనిపించాడు. అయితే, అతడి పక్కనే మరో అమ్మాయి ఉంది. దీంతో ఆ యువతి కోపం కట్టలు తెంచుకుంది. తన ప్రియుడి పక్కన ఉన్న అమ్మాయితో గొడవకు దిగింది. నా లవర్ తోనే తిరుగుతావా? అంటూ ఆ అమ్మాయిపైకి దూసుకెళ్లింది. చూస్తుండగానే ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది.

తన లవర్ తో తిరుగుతున్న అమ్మాయిపై యువతి దాడి చేసింది. జుట్టు పట్టుకుని లాగింది. కాళ్లతో తన్నింది. ఆమెకు ఫ్రెండ్స్ కూడా సాయపడ్డారు. నలుగురు అమ్మాయిలు కలిసి ఆ యువతిని దారుణంగా కొట్టారు. అమ్మాయిల దాడిలో బాధితురాలి దుస్తులు సైతం చిరిగిపోయాయి. అయినా వారు తగ్గలేదు. కొట్టుకోవడం ఆపలేదు.

Coins in Man Stomach: వామ్మో! కిలోన్నర కాయిన్స్‌ మింగిన వ్యక్తి, ఆపరేషన్ చేసి 187 నాణేలను బయటకు తీసిన డాక్టర్లు, మానసికవ్యాధి కారణంగానే మింగినట్లు గుర్తింపు 

అమ్మాయిల ఫైటింగ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీళ్లసలు అమ్మాయిలేనా? అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. వీళ్ల ఫైటింగ్ చూసి నోరెళ్లబెడుతున్నారు. అబ్బాయిలు కూడా ఇంత దారుణంగా కొట్టుకోరేమో అని కామెంట్ చేస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Nov 30, 2022 09:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).