Gujarat: గుజరాత్‌లో ఘోర విషాదం, కర్మాగారం గోడ కూలి 12 మంది మృతి, మరో ముగ్గురు శిథిలాల కిందే...
గుజరాత్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం మోర్బీలోని హల్వాద్ ఇండస్ట్రీయల్ ఏరియా(జీఐడీసీ)లోని సాగర్ ఉప్పు కర్మాగారం గోడ కూలి 12 మంది మరణించారు. మరో ముగ్గురు శిథిలాల కిందే ఇరుక్కుపోయినట్లు భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 12 మంది గోడ కిందే ప్రాణాలు వదిలిన ఘటన స్థానికంగా విషాదం నింపింది. ఘటన గురించి తెలియగానే.. స్థానిక ఎమ్మెల్యే బ్రిజేష్ మెర్జా ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటుందని ఆయన తెలిపారు.
At least 12 labourers killed in wall collapse at factory in Halwad GIDC in Gujarat's Morbi district: official
— Press Trust of India (@PTI_News) May 18, 2022
(The above story first appeared on LatestLY on May 18, 2022 03:10 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

