Gujarat: కండోమ్ లేదని పురుషాంగానికి సీల్ వేసుకుని సెక్స్, తరువాత చెట్ల పొదల్లో అపస్మారకంగా పడిన యువకుడు, చికిత్స పొందుతూ మృతి, గుజరాత్ అహ్మదాబాద్‌లో ఘటన
Representational image (Photo Credits: Pixabay)

Ahmedabad, August 24: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. గర్ల్‌ ఫ్రెండ్‌తో శృంగారం చేసేందుకు మర్మాంగానికి జిగురుతో సీల్‌ (Private Parts Seal) వేసుకున్న ఓ యువకుడు శవమై తేలాడు. మృతుడు అహ్మదాబాద్‌లోని ఫతేవాడి ప్రాంతానికి చెందిన సల్మాన్‌ మీర్జా (25) గా గుర్తించారు. అనుమానాస్పద స్థితిలో పొదల్లో పడివున్న సల్మాన్‌ను గుర్తించిన బంధువొకరు కుటుంబీకులతో కలిసి స్థానిక ఆస్పత్రిలో చేర్పించగా.. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్‌కు ఫతేవాడి ప్రాంతానికి చెందిన సల్మాన్‌ మీర్జాకు డ్రగ్స్‌ తీసుకోవడం అలవాటు. ఆయన గతంలో పెండ్లి చేసుకోవాలనుకున్న యువతికి కూడా డ్రగ్స్‌ తీసుకునే అలవాటు ఉన్నది. జూన్‌ 22 న డ్రగ్స్‌ తీసుకునేందుకు వీరిద్దరూ మరో మహిళతో కలిసి స్థానిక హోటల్‌లో రూం తీసుకున్నారు. అక్కడ డ్రగ్స్‌ తీసుకున్న తర్వాత శృంగారంలో పాల్గొనాలన్న ఆసక్తి కలిగింది. అయితే, యువతి గర్భం దాల్చకుండా ఉండాలంటే (protection during sex) కండోమ్ వాడాలనుకున్నారు. అయితే, వారి వద్ద కండోమ్‌ (No condom) లేకపోవడంతో.. వైట్‌నర్‌తో కలిపి డ్రగ్‌గా తీసుకునే జిగురులాంటి పదార్థంతో సల్మాన్‌ మీర్జా తన మర్మాంగాన్ని సీల్‌ చేసుకున్నాడు.

నాతో సెక్స్ చేయ్..డబ్బులు ఎంతైనా ఇస్తా, 16 ఏళ్ల బాలుడితో 42 మహిళా టీచర్ ఛాటింగ్, అమెరికాలో షాకింగ్ ఘటన, నిందితురాలిని అరెస్ట్ చేసి సమ్నర్ కౌంటీ జైలుకు తరలించిన పోలీసులు

ఇలాఉండగా, అంబర్‌ టవర్‌ ప్రాంతంలో అపస్మారకంగా చెట్ల పొదల్లో పడిఉన్న సల్మాన్‌ మీర్జాను చూసి గుర్తించిన బంధువు ఒకరు కుటుంబీకులకు సమాచారం అందించాడు. కుటుంబీకులు మీర్జాను సోలా సివిల్‌ ఆస్పత్రిలో చేర్చించగా.. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. మీర్జా మృతిపై మూడు రోజుల తర్వాత బంధువు సైరాబాను మీర్జా పోలీసులకు ఫిర్యాదు చేసి అనుమానం వ్యక్తం చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా.. మర్మాంగాన్ని జిగురుతో సీల్‌ చేసుకోవడం వల్ల ఆరోగ్యం క్షీణించి చనిపోయినట్లు తేల్చారు. ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపిన మృతుడి విసెరా శాంపిల్ నివేదిక కోసం మేము ఎదురుచూస్తున్నామని DCP (జోన్ 7) ప్రేమ్‌సుఖ్ చెప్పారు.