Gujarat Shocker: ప్రియుడు కళ్ల ముందే ప్రియురాలిపై 5 మంది సామూహిక అత్యాచారం, అనంతరం వారి మొబైల్స్ లాక్కెళ్లిన కామాంధులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

సూరత్‌లోని పొలంలో ఆదివారం రాత్రి 27 ఏళ్ల మహిళపై ఆమె ప్రియుడి ఎదుట ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి (Five Men Gang-Rape Woman) పాల్పడ్డారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. అత్యాచారం చేసిన తర్వాత నిందితులు వారి మొబైల్ ఫోన్‌లతో పారిపోయినట్లుగా ఆ కథనంలో తెలిపింది.

Gujarat Shocker: ప్రియుడు కళ్ల ముందే ప్రియురాలిపై 5 మంది సామూహిక అత్యాచారం, అనంతరం వారి మొబైల్స్ లాక్కెళ్లిన కామాంధులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
Rape | Representational Image (Photo Credits: Pixabay)

Surat, Sep 14: సూరత్‌లోని పొలంలో ఆదివారం రాత్రి 27 ఏళ్ల మహిళపై ఆమె ప్రియుడి ఎదుట ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి (Five Men Gang-Rape Woman) పాల్పడ్డారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. అత్యాచారం చేసిన తర్వాత నిందితులు వారి మొబైల్ ఫోన్‌లతో పారిపోయినట్లుగా ఆ కథనంలో తెలిపింది.

నివేదిక ప్రకారం, రాత్రి 8 గంటల సమయంలో రోడ్డు పక్కన మహిళ తన ప్రియుడితో కలిసి కూర్చున్నప్పుడు నిందితులు వచ్చి తమతో పాటు ఇద్దరు రావాలని బెదిరించారు. అయితే వారితో వెళ్లేందుకు లవర్స్ నిరాకరించారు. దీంతో నిందితులు ప్రియుడ్ని కట్టేసి దారుణంగా కొట్టారు. అనంతరం మహిళపై ప్రియుడి కళ్ల ముందే (Front of Her Boyfriend ) సామూహిక అత్యాచారం చేశారు.

గుజరాత్‌లో ఘోర విషాదం, యూనివర్సీటీ సమీపంలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌లో లిఫ్ట్‌ కూలి 8 మంది మృతి

అనంతరం బాధితురాలు తన సోదరితో తన బాధను పంచుకుంది. దీంతో ఆమె సోమవారం సాయంత్రం పోలీసులను ఆశ్రయించి ఐదుగురు గుర్తు తెలియని యువకులు తమ సోదరిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులపై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 376 (డి) (గ్యాంగ్ రేప్), 284 (ప్రజారోగ్యాన్ని ప్రభావితం చేసే నేరాలు), మరియు 506 (2) (క్రిమినల్ బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు.ఐదుగురు నిందితులను గుర్తించి వీలైనంత త్వరగా అరెస్టు చేసేందుకు విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

(The above story first appeared on LatestLY on Sep 14, 2022 06:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).