New HMPV Cases in Gujarat: గుజరాత్‌లో మరో బాలుడికి HMPV వైరస్‌, మొత్తం 8 కి చేరిన కేసుల సంఖ్య

నాలుగేళ్ల బాలుడికి హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) సోకింది. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. గుజరాత్‌లో (Gujarat) ఈ కేసుల సంఖ్య 8కి చేరినట్లు వెల్లడించారు. జనవరి 28న అహ్మదాబాద్‌లోని గోటా ప్రాంతానికి చెందిన నాలుగేళ్ల బాలుడు జ్వరం, దగ్గుతో బాధపడ్డాడు.

New HMPV Cases in Gujarat: గుజరాత్‌లో మరో బాలుడికి HMPV వైరస్‌, మొత్తం 8 కి చేరిన కేసుల సంఖ్య
Virus (Image Credits: Pixabay)

Ahmadabad, JAN 30: నాలుగేళ్ల బాలుడికి హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) సోకింది. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. గుజరాత్‌లో (Gujarat) ఈ కేసుల సంఖ్య 8కి చేరినట్లు వెల్లడించారు. జనవరి 28న అహ్మదాబాద్‌లోని గోటా ప్రాంతానికి చెందిన నాలుగేళ్ల బాలుడు జ్వరం, దగ్గుతో బాధపడ్డాడు. ఎస్‌జీవీపీ ఆసుపత్రిలో అడ్మిట్‌ కావడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు.  దీంతో ఆ బాలుడికి హెచ్‌ఎంపీవీ (HMPV) సోకిందని అదే రోజున నిర్ధారించినట్లు అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ అధికారి తెలిపారు.

Assam Horror: అస్సాంలో దారుణం, పిల్లల ముందే తల్లిని మంచానికి కట్టేసి అత్యాచారం, అంతటితో ఆగక అక్కడ యాసిడ్ పోసి పరార్, కేసు నమోదు చేసుకున్న పోలీసులు  

ఆ బాలుడు ఇటీవల విదేశాల్లో ప్రయాణించినట్లు చెప్పారు. కాగా, గుజరాత్‌లో ఇప్పటి వరకు 8 హెచ్‌ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. అహ్మదాబాద్‌లో ఏడు, సబర్కాంత జిల్లాలో ఒక కేసు వెలుగుచూశాయి. అహ్మదాబాద్‌లోని ఆసుపత్రుల్లో చేరిన ఆరుగురు రోగులను పూర్తిగా కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

(The above story first appeared on LatestLY on Jan 30, 2025 09:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).