Yashasvi Jaiswal Out Video: వివాదాస్పదంగా మారిన య‌శ‌స్వి జైస్వాల్ ఔట్, థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పు బట్టిన మాజీ క్రికెట‌ర్ గ‌వాస్క‌ర్‌, వీడియో ఇదిగో..

మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియా - భారత జట్ల (AUS vs IND) మధ్య బాక్సింగ్‌ డే టెస్టు జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియాపై ఆసీస్‌ 184 పరుగుల తేడాతో విజయం సాధించింది.ఆస్ట్రేలియా నిర్దేశించిన 340 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 155 పరుగులకే ఆలౌట్ కావడంతో ఓటమి తప్పలేదు.

Yashasvi Jaiswal Out Video: వివాదాస్పదంగా మారిన య‌శ‌స్వి జైస్వాల్ ఔట్, థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పు బట్టిన మాజీ క్రికెట‌ర్ గ‌వాస్క‌ర్‌, వీడియో ఇదిగో..
Sunil Gavaskar (left) and Yashasvi Jaiswal's dismissal (right) (Photo credit: X @ICC and @StarSportsIndia)

మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియా - భారత జట్ల (AUS vs IND) మధ్య బాక్సింగ్‌ డే టెస్టు జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియాపై ఆసీస్‌ 184 పరుగుల తేడాతో విజయం సాధించింది.ఆస్ట్రేలియా నిర్దేశించిన 340 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 155 పరుగులకే ఆలౌట్ కావడంతో ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్ లో ఇండియ‌న్ బ్యాట‌ర్ య‌శ‌స్వి జైస్వాల్(Yashasvi Jaiswal) ఔటైన తీరు వివాదాస్ప‌ద‌మైంది.రెండో ఇన్నింగ్స్‌లో అత్యంత కీల‌క‌మైన ఆట ఆడుతున్న స‌మ‌యంలో.. జైస్వాల్‌ను థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్ర‌క‌టించాడు.

రెండో ఇన్నింగ్స్‌లో 1 ప‌రుగుకే వెనుదిరిగిన నితీష్ రెడ్డి, బాక్సింగ్‌ డే టెస్టులో టీమిండియాపై 184 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం

అసలేం జరిగిందంటే.. లెగ్ సైడ్‌లో క‌మ్మిన్స్ షార్ట్‌పిచ్ బంతి వేశాడు. దాన్ని హుక్ చేయ‌బోగా, అది మిస్సైంది. కీప‌ర్ అలెక్సీ ఆ బంతిని అందుకున్నాడు. ఆన్‌ఫీల్డ్ అంపైర్ జోయ‌ల్ విల్స‌న్ దాన్ని నాటౌట్‌గా ప్ర‌క‌టించారు. బౌల‌ర్ రివ్యూకు వెళ్ల‌డంతో .. థార్డ్ అంపైర్ జోయ‌ల్ విల్స‌న్ ఔట్ ఇచ్చేశాడు. అయితే బ్యాట్‌కు బంతి త‌గిలిన‌ట్లు స్నికోలో తేల‌లేదు. కానీ బంతి ప్ర‌యాణిస్తున్న లైన్ స్వ‌ల్పంగా మారిన‌ట్లు గుర్తించిన థార్డ్ అంపైర్ అత‌న్ని అవుట్‌గా ప్ర‌క‌టించాడు.208 బంతులు ఆడిన జైస్వాల్ 84 ర‌న్స్ వ‌ద్ద ఔట‌య్యాడు.

Yashasvi Jaiswal Out Video

దీనిపై మాజీ క్రికెట‌ర్ గ‌వాస్క‌ర్‌.. థర్డ్ అంపైర్ నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌ట్టారు. బంతి బ్యాట్‌కు తాక‌లేద‌న్నారు. బంతి వెళ్లిన మార్గాన్ని కేవవం ఆప్టిక‌ల్ ఇల్యూజ‌న్‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు. స్నికో టెక్నాల‌జీ ద్వారా గుర్తించ‌లేని విష‌యాన్ని ఎలా ఔట్‌గా పరిగ‌ణిస్తార‌ని ప్ర‌శ్నించారు. టెక్నాల‌జీతో ఔట్ నిర్ణ‌యాన్ని తేల్చ‌లేన‌ప్పుడు, అస‌లు ఆ టెక్నాల‌జీ వ‌ద్ద‌న్నారు.

(The above story first appeared on LatestLY on Dec 30, 2024 02:07 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).