AUS beat IND by 184 runs (photo/X)

మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియా - భారత జట్ల (AUS vs IND) మధ్య బాక్సింగ్‌ డే టెస్టు జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియాపై ఆసీస్‌ 184 పరుగుల తేడాతో విజయం సాధించింది.ఆస్ట్రేలియా నిర్దేశించిన 340 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 155 పరుగులకే ఆలౌట్ కావడంతో ఓటమి తప్పలేదు.

భార‌త బ్యాట‌ర్‌ల‌లో య‌శ‌స్వి జైశ్వ‌ల్ 84 ప‌రుగుల‌తో టాప్ స్కోరర్‌గా నిలువ‌గా.. పంత్ 30 ప‌రుగుల‌తో రాణించాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌, సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా.. కేల్ రాహుల్, బుమ్రా, సిరాజ్ డకౌట్ అయ్యారు. ఇక ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో సెంచరీతో క‌దం తొక్కిన తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి రెండో ఇన్నింగ్స్‌లో 1 ప‌రుగుకే వెనుదిరిగాడు. ఆసీస్ బౌల‌ర్ల‌లో క‌మిన్స్ మూడు వికెట్లు, బోలాండ్ 3, నాథన్ లియాన్ 2, మిచెల్ స్టార్క్, హెడ్ చెరో వికెట్ తీశారు. ఐదు టెస్టుల (Border - Gavaskar Trophy 2024) సిరీస్‌లో ఆసీస్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

AUS beat IND by 184 Runs

చివరి మ్యాచ్‌ జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది. ఈ టెస్టు అనంతరం కెప్టెన్ రోహిత్ వీడ్కోలు చెబుతాడని వార్తలు వస్తున్నాయి.