India Post (Photo credit: India post @PostOffice.IN facebook page)

New Delhi, FEB 15: దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 40,889 గ్రామీణ డాక్ సేవక్(GDS) ఉద్యోగాల(postal jobs)కు దరఖాస్తు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకొనేందుకు ఇంకా ఒక్కరోజే మిగిలి ఉంది. పదో తరగతి అర్హతపై పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌, అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌/డాక్‌ సేవక్‌ ఉద్యోగాల భర్తీకి గత నెల 27 నుంచి తపాలాశాఖ ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 16 వరకు https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకొనేందుకు అవకాశం ఉంది. ఇండియా పోస్ట్‌(India post) విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం.. ఏపీలో 2480 పోస్టులు ఖాళీలు ఉండగా.. తెలంగాణలో 1266 పోస్టులు ఉన్నాయి.

Telangana Govt Jobs 2022: నిరుద్యోగులకు మరో శుభవార్త, 1,433 పోస్టులకు తెలంగాణ ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌, త్వరలో ఈ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల 

దరఖాస్తుల్లో తప్పులను సవరించుకొనేందుకు ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు గడువు ఇచ్చారు. ఈ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి (ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంది). కంప్యూటర్‌ పరిజ్ఞానంతో పాటు సైకిల్‌ తొక్కడం కూడా రావాలి. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది.

Jobs in Singareni: సింగరేణిలో కొలువుల జాతర, 177 పోస్టులకు నోటిఫికేషన్ జారీ, ఈ జిల్లాల వారికి బంపర్ ఆఫర్, పోస్టుల్లో 95 శాతం వాళ్లకే, దరఖాస్తు చేసుకునే పద్దతి ఇదే! 

వీటితోపాటు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్‌ సేవక్‌లకు ప్రోత్సాహకాలు ఉంటాయి. ఆయా సేవల విలువ ప్రకారం ఇన్సెంటివ్‌ ఆధారపడి ఉంటుంది. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్‌/ కంప్యూటర్‌/ స్మార్ట్‌ ఫోన్‌ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాల్సి ఉంటుంది.