Coronavirus in India: కరోనా థర్డ్‌వేవ్‌ రావాలంటే కొత్త వేరియంట్లు రావాలి, కొత్త స్ట్రెయిన్‌ వస్తేనే థర్డ్‌వేవ్‌ ప్రమాదం ఉంటుందని తెలిపిన నిపుణులు, దేశంలో తాజాగా 34,403 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు

దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 34,403 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా నుంచి కోలుకుని 37,950 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 3,39,056గా ఉంది. అలాగే దేశ వ్యాప్తంగా మొత్తం 3,25,98,424 కరోనా కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో 77.24 కోట్ల మంది టీకా తీసుకున్నారు. 4,44,248 మంది మహమ్మారికి బలయ్యారు.

Coronavirus in India: కరోనా థర్డ్‌వేవ్‌ రావాలంటే కొత్త వేరియంట్లు రావాలి, కొత్త స్ట్రెయిన్‌ వస్తేనే థర్డ్‌వేవ్‌ ప్రమాదం ఉంటుందని తెలిపిన నిపుణులు, దేశంలో తాజాగా 34,403 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు
Coronavirus | Representational Image | (Photo Credits: Pixabay)

New Delhi, Sep 17: దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 34,403 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా నుంచి కోలుకుని 37,950 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 3,39,056గా ఉంది. అలాగే దేశ వ్యాప్తంగా మొత్తం 3,25,98,424 కరోనా కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో 77.24 కోట్ల మంది టీకా తీసుకున్నారు. 4,44,248 మంది మహమ్మారికి బలయ్యారు.

ఇందులో కొత్తగా 37,950 మంది వైరస్‌ (Coronavirus in India) నుంచి బయటపడగా, 320 మంది మరణించారని (320 Deaths in Past 24 Hours) కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక దేశంలో 77,24,25,744 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది. ఒక్క రోజులోనే 63,97,972 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని పేర్కొన్నది.

రానున్న రెండు, మూడు నెలలు పండుగల సీజన్‌ కావడంతో ప్రజలు గుమికూడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని.. ఈ క్రమంలో కరోనా వైరస్‌ కూడా వేగంగా వ్యాప్తిచెందే అవకాశముంటుందని కేంద్రం హెచ్చరించింది. కాబట్టి ప్రజలు కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ పండుగలు జరుపుకోవాలని సూచించింది. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని కోరింది. పండుగల సమయంలో ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దని, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సంతోషంగా జరుపుకోవాలని సూచించింది

మళ్లీ ఇంకో కొత్త వేరియంట్, దక్షిణాఫ్రికాతో సహా పలు దేశాల్లో కరోనా C.1.2 వేరియంట్ ని కనుగొన్న శాస్త్రవేత్తలు, వ్యాక్సిన్‌కు సైతం ఈ కొత్త వేరియంట్ లొంగదని నివేదికలో వెల్లడి

ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో థర్డ్‌వేవ్‌ దశ మొదలవ్వాలంటే ఇప్పుడున్న వైరస్‌ వేరియంట్లు కాకుండా, బలమైన కొత్త స్ట్రెయిన్‌ భారీగా వ్యాప్తి చెందాలని.. అప్పుడే మూడో దశకు అవకాశాలుంటాయని ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ప్రొఫెసర్‌ మణీంద్ర అగర్వాల్‌ తెలిపారు. డెల్టా వేరియంట్‌ తర్వాత ఆ స్థాయి తీవ్రత గల స్ట్రెయిన్‌ను దేశంలో ఇప్పటివరకూ గుర్తించలేదన్నారు. దీంతో ఒకవిధంగా థర్డ్‌వేవ్‌ ముప్పు లేనట్టేనని ఆశాభావం వ్యక్తం చేశారు. కేరళలో కేసుల పెరుగుదలపై స్పందిస్తూ.. అది ఆ రాష్ర్టానికే పరిమితమైన విషయాన్ని గుర్తుచేశారు. కొవిడ్‌-19 సెకండ్‌వేవ్‌ సరళిని కచ్చితత్వంతో అంచనా వేసిన ‘సూత్రా మోడల్‌’ తయారీ బృందంలో అగర్వాల్‌ ఒకరు.

అమెరికాలో జింకకు కరోనావైరస్, ప్రపంచంలోనే తొలికేసు, అడవి తెల్ల తోక జింకకు కొవిడ్-19 వైరస్ సోకిందని వెల్లడించిన అమెరికా వ్యవసాయ శాఖ

అక్టోబర్‌ మధ్యనాటికి కరోనా థర్డ్‌వేవ్‌ విరుచుకుపడుతుందన్న అంచనాలను తెలంగాణ డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ శ్రీనివాసరావు కొట్టిపారేశారు. ఈ వాదనకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవన్నారు. ప్రమాదకరమైన కొత్త స్ట్రెయిన్‌ వస్తేనే థర్డ్‌వేవ్‌ ప్రమాదం ఉంటుందని, ప్రస్తుతానికి అలాంటి వేరియంట్ల జాడలేదన్నారు. ఇంకోవైపు, ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వేరియంట్లు రూపాంతరం చెంది కొత్త స్ట్రెయిన్‌గా మారడానికి ఆరు నెలల సమయం పడుతుందని, అయితే ఆ కొత్త స్ట్రెయిన్‌ తీవ్రత ఎక్కువగా ఉంటేనే థర్డ్‌వేవ్‌ ప్రమాదం పొంచి ఉండొచ్చని సీసీఎంబీ అంతర్గత సమావేశంలో అభిప్రాయపడింది. అయితే, అప్పటికే అందరూ వ్యాక్సిన్‌ వేసుకుంటారని, దీంతో మూడోవేవ్‌ ముప్పు లేనట్టేనని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రఖ్యాత వైరాలజిస్ట్‌ డాక్టర్‌ గగన్‌దీప్‌ కాంగ్‌, బెనారస్‌ హిందూ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జ్ఞానేశ్వర్‌ చౌబే కూడా దాదాపుగా ఇవే అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు.

వచ్చే ఆరు నెలల్లో కొవిడ్‌-19 ఎండెమిక్‌ (కొన్ని ప్రాంతాలకే పరిమితమైన వ్యాధి) దశకు చేరుకొంటుందని జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం(ఎన్‌సీడీసీ) డైరెక్టర్‌ సుజీత్‌ సింగ్‌ అన్నారు. ఒక వేళ కొత్త వేరియంట్‌ వచ్చినా.. అదొక్కటే మూడో వేవ్‌ను తీసుకురాలేదని పేర్కొన్నారు. మరోవైపు, కొవిడ్‌-19 భారత్‌లో ఎండెమిక్‌ దశకు మారుతున్నట్లు కనిపిస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌ కూడా ఇటీవలే వెల్లడించారు. వచ్చే ఏడాది చివరినాటికి.. దేశంలో 70% వ్యాక్సినేషన్‌ పూర్తయి, కొవిడ్‌కు ముందునాటి పరిస్థితులు తిరిగి వస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్‌ వేసుకోవడం, కొవిడ్‌-19 నిబంధనలను పాటించడంతో థర్డ్‌వేవ్‌ ముప్పును తరిమివేయచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పద్దెనిమిదేండ్లు నిండిన ప్రతీ ఒక్కరికి రెండు డోసుల టీకా వేయడమే తమ ముందున్న అత్యంత ప్రాధాన్య అంశమని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ తెలిపారు. బూస్టర్‌ డోసు వేసే ఉద్దేశం ప్రస్తుతానికి లేదని పేర్కన్నారు. దేశంలో 20% మంది రెండు డోసుల టీకా వేసుకొన్నారని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ చెప్పారు. 62% మంది ఒక్కడోసు వేసుకొన్నట్టు వెల్లడించారు.

(The above story first appeared on LatestLY on Sep 17, 2021 12:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).