Coronavirus | Representational Image | (Photo Credits: Pixabay)

Johannesburg, August 31: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్ సరికొత్త వేరియంట్లతో ఆందోళన రేకెత్తిస్తోంది. తాజాగా మరో కొత్త వేరియంట్ వెలుగు చూసింది. దక్షిణాఫ్రికాతో సహా ప్రపంచంలోని అనేక ఇతర దేశాల్లో C.1.2 అనే కొత్త కరోనా వైరస్ వేరియంట్‌ను(New Covid variant) శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ వేరియంట్ మరింత వేగంగా, చాలా సమర్థవంతంగా వ్యాప్తి చెందుతుందని.. టీకాల అందించే రక్షణను సైతం తప్పించుకోగలదని తాజా అధ్యయనం వెల్లడించింది.

దక్షిణాఫ్రికా(South Africa) జాతీయ అంటువ్యాధుల సంస్థ(NICD), క్వాజులు-నేటల్ రీసర్చ్ ఇన్నోవేషన్స్ అండ్ సీక్వెన్సింగ్ ప్లాట్​ఫామ్ సంస్థల శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ C.1.2 వేరియంట్ ను మే నెలలో సౌత్ ఆఫ్రికా దేశంలో మొదటిసారిగా గుర్తించామని వెల్లడించారు. దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో గుర్తించిన ఈ కొత్త వేరియంట్ అత్యంత ప్రమాదకరమని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్ నిపుణులు చెబుతున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన కేఆర్ఐఎస్‌పీ సంస్థతో జరిపిన పరిశోధనలో కరోనా కొత్త వేరియంట్ సీ 1.2 బయటపడిందని అంటున్నారు.

2021 మే నెలలోనే ఈ వేరియంట్‌ను గుర్తించామని..ఆగస్టు నాటికి చైనా, కాంగో, మారిషస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పోర్చుగల్, స్విట్జర్లాండ్‌లలో ఈ వేరియంట్ జాడలు కన్పించాయని చెబుతున్నారు. కొత్త వేరియంట్‌లు(Covid New Variant)రావడం సహజమే అయినా ఈ వేరియంట్ కాస్త ప్రత్యేకంగా ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కరోనా వ్యాక్సిన్‌కు(Corona Vaccine)ఈ వేరియంట్ అందదని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు ఆందోళనకు కారణమవుతోంది. కరోనా వ్యాక్సిన్ కల్పించే రక్షణ వ్యవస్థను దాటుకుని ఈ వేరియంట్ ముందుకు పోతుందని నిపుణుల పరిశోధనలో వెల్లడైంది.

అమెరికాలో జింకకు కరోనావైరస్, ప్రపంచంలోనే తొలికేసు, అడవి తెల్ల తోక జింకకు కొవిడ్-19 వైరస్ సోకిందని వెల్లడించిన అమెరికా వ్యవసాయ శాఖ

ఇతర వేరియంట్లతో పోలిస్తే ఈ వేరియంట్ ఉత్పరివర్తనాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఎన్ఐసీడీ(NICD) శాస్త్రవేత్తలు తెలిపారు. అటు దక్షిణాఫ్రికాలో ఈ వేరియంట్ జీనోమ్స్ సంఖ్య పెరుగుతూ వస్తోందని అధ్యయనం తెలిపింది. ఈ వేరియంట్‌లో మ్యూటేషన్ రేటు 41 శాతం ఉందని తెలుస్తోంది. సీ 1.2 వేరియంట్‌లో(Corona C 1.2 Variant) కన్పించే కొత్త రకాల మ్యూటేషన్లు క్లాస్ 3 యాంటీబాడీలను(Antibodies) తప్పించుకోగలదని తేలడం ఆందోళనను పెంచుతోంది. ఈ వేరియంట్‌లో ఎన్ 440 కే, వై 449 హెచ్ మ్యూటేషన్లు ఉన్నట్టు కనుగొన్నారు.