New Delhi, April 12: కరోనా వైరస్ దేశాన్ని మళ్లీ వణికించేందుకు రెడీ అయింది. గత ఏడు రోజుల్లోనే దేశంలోనే 42వేల మందికిపైగా వైరస్ (Covid in India) బారినపడ్డారు. 97 మంది మృత్యువాతపడ్డారు.ప్రస్తుతం దేశంలో 40,215 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. మంగళవారం 2.14లక్షల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 7,830 కొవిడ్ నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లో వైరస్ కారణంగా 16 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు.ఇప్పటి వరకు కొవిడ్‌తో 5.31లక్షల మంది మృతి చెందగా..మొత్తం కేసుల సంఖ్య 4.47కోట్లకు చేరింది. ఇప్పటి వరకు దేశంలో 220.66కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారు.
మహారాష్ట్రలో కరోనా కల్లోలం, ఒక్కరోజే 1,115 కొత్త కేసులు నమోదు, గత 24 గంటల్లో 9 మంది మృతి
ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో భారత్ మూడోస్థానంలో (India Again Among The Top-3 Most Affected Covid Countries) ఉన్నది. దక్షిణ కొరియాలో 12వేలు, జపాన్‌లో 9వేలు, భారత్‌లో 5నుంచి7వేల కేసులు నమోదవుతున్నాయి. రష్యా, బ్రెజిల్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ లో కరోనా ఫోర్త్ వేవ్ మొదలైందా (Is It Fourth Wave Of Corona) అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే నిపుణులు మాత్రం ప్రస్తుతం దేశంలో కొత్త వేవ్ వచ్చే అవకాశం లేదని, దేశంలో చాలా మంది వ్యాక్సిన్ తీసుకున్నారని, భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అయితే ప్రమాదం లేదని నిర్లక్ష్యం పనికిరాదని, తమను తాము కాపాడుకోవాలన్నారు. అందరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని చెప్పారు.
దేశంలో మళ్లీ లాక్‌డౌన్ విధించే ప్రశ్నే లేదన్నారు. కరోనా వైరస్ దేశంలో ఎండెమిక్ స్టేజ్ లో ఉందని, జలుబు, ఫ్లూ మాదిరిగా మారుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. మరో పది రోజులు కేసులు పెరిగే అవకాశం ఉందని, ఆ తర్వాత తగ్గుముఖం పడుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కేసుల పెరుగుదలకు XBB.1.16 వేరియంట్ కారణమని పేర్కొంటున్నారు. అయినా భయం లేదని మాస్క్ ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, రద్దీప్రాంతాలకు దూరంగా ఉండడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు.