Covid Updates in India: జూన్‌లో మరో వ్యాక్సిన్, కోవోవ్యాక్స్ టీకాను తీసుకువస్తామని తెలిపిన సీరం, దేశంలో తాజాగా 13,052 మందికి కరోనా నిర్ధారణ, తెలంగాణలో కొత్తగా 163 కోవిడ్ కేసులు
దేశంలో గత 24 గంటల్లో 13,052 మందికి కరోనా నిర్ధారణ (Covid Updates in India) అయింది. అదే సమయంలో 13,965 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,07,46,183 కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 127 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,54,274 కు (Covid Deaths) పెరిగింది. దేశంలో కరోనా (Coronavirus) నుంచి ఇప్పటివరకు 1,04,23,125 మంది కోలుకున్నారు.
New Delhi, Jan 31: దేశంలో గత 24 గంటల్లో 13,052 మందికి కరోనా నిర్ధారణ (Covid Updates in India) అయింది. అదే సమయంలో 13,965 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,07,46,183 కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 127 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,54,274 కు (Covid Deaths) పెరిగింది. దేశంలో కరోనా (Coronavirus) నుంచి ఇప్పటివరకు 1,04,23,125 మంది కోలుకున్నారు.
1,68,784 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. కాగా దేశంలో నిన్నటి వరకు మొత్తం 19,65,88,372 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,50,964 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
ఆరోగ్య సిబ్బంది కోసం ప్రారంభించిన దేశవ్యాప్త కోవిడ్–19 వ్యాక్సినేషన్‌లో ( Covid Vaccination) ఇప్పటి వరకు 35 లక్షల మందికి టీకా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 5.70 లక్షల మందికి టీకా వేసినట్లు తెలిపింది. వీరిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 4,63,793 మంది, రాజస్తాన్‌లో 3,24,973 మంది, కర్ణాటకలో 3,07,891 మంది, మహారాష్ట్రలో 2,61,320 మంది లబ్ధిదారులు ఉన్నారని తెలిపింది. ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ కోసం 63,687 సెషన్లు నిర్వహించినట్లు వెల్లడించింది. దేశంలో కోవిడ్ యాక్టివ్ కేసులు 1.7 లక్షలకు తగ్గిపోయాయని ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం పాజిటివ్ కేసుల్లో యాక్టివ్ కేసులు 1.58% మాత్రమేనని వెల్లడించింది.
ఇక తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 163 కరోనా కేసులు (TS Coronavirus) నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం... గత 24 గంటల్లో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 276 మంది కోలుకున్నారు.ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,94,469 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,90,630 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,599 కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 2,240 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 828 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 28 కరోనా కేసులు నమోదయ్యాయి.
కోవిడ్–19ను నిలువరించే కోవోవ్యాక్స్ అనే మరో టీకాను వచ్చే జూన్‌లో అందుబాటులోకి తెస్తామని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ)ప్రకటించింది. ట్రయల్స్ ప్రారంభించేందుకు అనుమతులు కోరుతూ ఇప్పటికే దరఖాస్తు చేశామని ఎస్‌ఐఐ సీఈవో అధర్ పూనావాలా శనివారం ట్విట్టర్‌లో తెలిపారు. నోవావ్యాక్స్‌తో కలిసి అభివృద్ధి చేస్తున్న ఈ టీకా పనితీరు అద్భుతంగా ఉందన్నారు. 2021 జూన్ కల్లా ఈ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ– ఆస్ట్రా జెనెకా ఉమ్మడిగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ టీకాను ఎస్‌ఐఐ ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. దేశంలో ప్రారంభమైన ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కోవిషీల్డ్‌తోపాటు కోవాగ్జిన్ టీకాలను ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం కేంద్రం 1.1 కోట్ల డోసుల కోవిషీల్డ్ టీకాను ఎస్‌ఐఐ నుంచి కొనుగోలు చేసింది. ఏప్రిల్ నాటికి నాలుగైదు కోట్ల నోవావ్యాక్స్ టీకా డోసులను ఉత్పత్తి చేస్తామని ఇటీవలే పూనావాలా ప్రకటించారు.
(The above story first appeared on LatestLY on Jan 31, 2021 10:53 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

