Coronavirus in India: భారత్‌లో తగ్గిన కరోనా తీవ్రత, నిన్నటితో పోలిస్తే పెరిగిన మరణాలు, 0.63 శాతానికి చేరిన రోజువారీ పాజిటివిటీ రేటు, యాక్టీవ్ కేసుల్లోనూ గణనీయమైన మార్పు

భారత్‌ లో కరోనా తీవ్రత తగ్గుతోంది. రోజు రోజుకూ కరోనా కేసులు తగ్గతున్నాయి. నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 5,921 కరోనా కేసులు (Daily Corona cases) నమోదయ్యాయి. అయితే నిన్నటితో పోలిస్తే మరణాలు పెరగడం కొంత కలవరానికి గురి చేస్తోంది. శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి 289 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,14,878 కి చేరింది.

Coronavirus in India: భారత్‌లో తగ్గిన కరోనా తీవ్రత, నిన్నటితో పోలిస్తే పెరిగిన మరణాలు,  0.63 శాతానికి చేరిన రోజువారీ పాజిటివిటీ రేటు, యాక్టీవ్ కేసుల్లోనూ గణనీయమైన మార్పు
Coronavirus | Representational Image (Photo Credits: ANI)

New Delhi March 05: భారత్‌ లో కరోనా తీవ్రత తగ్గుతోంది. రోజు రోజుకూ కరోనా కేసులు తగ్గతున్నాయి. నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 5,921 కరోనా కేసులు (Daily Corona cases) నమోదయ్యాయి. అయితే నిన్నటితో పోలిస్తే మరణాలు పెరగడం కొంత కలవరానికి గురి చేస్తోంది. శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి 289 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,14,878 కి చేరింది. ఇక కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య మాత్రం గణనీయంగా పెరుగుతుండటం ఊరటనిస్తోంది. నిన్న ఒక్కరోజే 11,651 మంది కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య (Corona (Active cases) కూడా క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 63,878 యాక్టీవ్ కేసులున్నాయి. అటు రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు (Daily positivity rate) భారీగా తగ్గింది. ప్రస్తుతం 0.63 శాతంగా ఉంది.

కేరళతో పాటూ కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కూడా కరోనా తీవ్రత తగ్గుతోంది. కేవలం ఒక్క రాష్ట్రంలో మాత్రమే పదివేల యాక్టీవ్ కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అటు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు 1,78,55,66,940 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తయినట్లు కేంద్రం ప్రకటించింది. యువజనుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసినట్లు అధికారులు తెలిపారు.

(The above story first appeared on LatestLY on Mar 05, 2022 09:55 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).