Coronavirus in India: భారత్‌లో తగ్గిన కరోనా తీవ్రత, 0.69 శాతానికి చేరిన రోజువారీ పాజిటివిటీ రేటు, 0.16 శాతానికి చేరిన యాక్టీవ్ కేసులు, గణనీయంగా తగ్గిన మరణాలు
భారత్ లో కరోనా తీవ్రత తగ్గుతోంది. రోజు రోజుకూ కరోనా కేసులు తగ్గతున్నాయి. నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 6,396 కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం నాడు దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి 201 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,14,589 కి చేరింది. ఇక కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య మాత్రం గణనీయంగా పెరుగుతుండటం ఊరటనిస్తోంది.
New Delhi March 04: భారత్ లో కరోనా తీవ్రత తగ్గుతోంది. రోజు రోజుకూ కరోనా కేసులు తగ్గతున్నాయి. నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 6,396 కరోనా కేసులు (Daily Corona cases) నమోదయ్యాయి. గురువారం నాడు దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి 201 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,14,589 కి చేరింది. ఇక కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య మాత్రం గణనీయంగా పెరుగుతుండటం ఊరటనిస్తోంది. నిన్న ఒక్కరోజే 13,450 మంది కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య (Corona (Active cases) కూడా క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 69,897 యాక్టీవ్ కేసులున్నాయి. అటు రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు (Daily positivity rate) భారీగా తగ్గింది. ప్రస్తుతం 0.69 శాతంగా ఉంది.
India reports 6,396 fresh #COVID19 cases, 13,450 recoveries, and 201 deaths in the last 24 hours.
Active case: 69,897 (0.16%)
Daily positivity rate: 0.69%
Total recoveries: 4,23,67,070
Death toll: 5,14,589
Total vaccination: 1,78,29,13,060 pic.twitter.com/ETHAm9nj2f
— ANI (@ANI) March 4, 2022
కేరళతో పాటూ కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కూడా కరోనా తీవ్రత తగ్గుతోంది. కేవలం ఒక్క రాష్ట్రంలో మాత్రమే పదివేల యాక్టీవ్ కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అటు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు 1,78,29,13,060 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తయినట్లు కేంద్రం ప్రకటించింది. యువజనుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసినట్లు అధికారులు తెలిపారు.
(The above story first appeared on LatestLY on Mar 04, 2022 10:11 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

