India to Resume Regular International Flights: ఈ నెల 27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం, నిబంధనలను పకడ్బందీగా అమలు చేయనున్నట్లు తెలిపిన పౌర విమానయాన శాఖ
కరోనా కారణంగా నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులను భారత్ పునఃప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ నెల 27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లుగా పౌర విమానయాన శాఖ మంగళవారం నాడు ప్రకటించింది.
- Read in
- తెలుగు
కరోనా కారణంగా నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులను భారత్ పునఃప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ నెల 27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లుగా పౌర విమానయాన శాఖ మంగళవారం నాడు ప్రకటించింది. అయితే ఈ ప్రయాణాల్లో వైద్య,ఆరోగ్య శాఖ సూచించిన నిబంధనలను పకడ్బందీగా అమలు చేయనున్నట్లుగా కూడా ఆ శాఖ ప్రకటించింది. కోవిడ్ విజృంభణతో విదేశాలకు దేశీయ విమాన సర్వీసులు, దేశానికి విదేశీ విమాన సర్వీసులను ఇప్పటికే పలుమార్లు నిలిపివేసిన సంగతి తెలిసిందే.
కరోనా తొలి వేవ్‌తో మొదలైన ఈ సర్వీసుల నిలుపుదల.. కరోనా కాస్తంత తగ్గగానే తిరిగి పునరుద్ధరించబడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ఇటీవలే అంతర్జాతీయ విమాన సర్వీసులను భారత్ నిలిపివేసింది. తాజాగా దేశంలో రోజువారీ కరోనా కొత్త కేసుల సంఖ్య 4 వేలకు దిగడంతో కొన్ని జాగ్రత్తలతో అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కరోనా నిబంధనలను మాత్రం తప్పనిసరిగా పాటించనున్నట్లు ప్రకటించింది.
Govt of India has decided to resume scheduled commercial international passenger services to/from India from 27.03.2022. International operations shall be subject to strict adherence to Ministry of Health guidelines for international travel: Civil Aviation Ministry pic.twitter.com/3dfVgTbrm0
— ANI (@ANI) March 8, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 08, 2022 09:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

