Chetak Emergency Landing in Fields: చేతక్ హెలికాప్టర్‌లో ఇంజిన్ చిప్ వార్నింగ్ లైట్ ఆన్, పొలాల్లో అత్యవసరంగా ల్యాండ్ చేసిన పైలెట్లు, వీడియో ఇదిగో..
ఇండియన్ ఆర్మీకి చెందిన చేతక్ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసరంగా పొలాల్లో దిగింది.సమస్య పరిష్కారం అయిన తరువాత అక్కడి నుంచి అది ఎగిరి వెళ్లింది. అయితే ఆర్మీ హెలికాప్టర్‌ను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు.ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
- Read in
- తెలుగు
Chetak Helicopter Emergency Landing in Fields: ఇండియన్ ఆర్మీకి చెందిన చేతక్ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసరంగా పొలాల్లో దిగింది.సమస్య పరిష్కారం అయిన తరువాత అక్కడి నుంచి అది ఎగిరి వెళ్లింది. అయితే ఆర్మీ హెలికాప్టర్‌ను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు.ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
రాజస్థాన్‌లోని జైపూర్‌కు వెళ్తున్న ఆర్మీకి చెందిన చేతక్ హెలికాప్టర్‌లో ఇంజిన్ చిప్ వార్నింగ్ లైట్ ఆన్ అయ్యింది.దీంతో పైలట్లు అప్రమత్తమై ముందు జాగ్రత్త కోసం సమీపంలోని పొలాల్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.సాంకేతిక సమస్యను సరిదిద్దిన తర్వాత హెలికాప్టర్ నిర్ణీత గమ్యస్థానానికి చేరుకున్నట్లు ఆర్మీ వెల్లడించింది.జైపూర్‌కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిద్వానాలో శుక్రవారం ఉదయం 10:35 గంటల సమయంలో సైనిక హెలికాప్టర్ పొలాల్లో దిగినట్లు తెలిపింది. ఆ సమయంలో అందులో వీఐపీలు ఎవరూ లేరని ఇండియన్ ఆర్మీ పేర్కొంది. ఐఏఎఫ్ విమానంకు తప్పిన పెను ప్రమాదం, సాంకేతిక లోపంతో గంట సేపు గాలిలోనే చక్కర్లు, ఎట్టకేలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్
Here's ANI Video
#WATCH | Rajasthan | One Chetak helicopter en route to Jaipur made a precautionary landing in fields at 10:35 AM in Didwana today due to Engine Chip Warning light. No VIP was present on board. The issue has been rectified and the chopper has moved towards its destination https://t.co/GdrOHOCdGb pic.twitter.com/o6cWemqCqz
— ANI (@ANI) March 1, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 01, 2024 08:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

