Railway Projects: ఇండియన్ రైల్వేస్‌కు భారీ బూస్ట్.. రూ.20,804 కోట్ల భారీ పెట్టుబడి.. 1,196 కి.మీ రైల్వే ట్రాక్‌లకు గ్రీన్ సిగ్నల్..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) సమావేశంలో, తొమ్మిది రాష్ట్రాల పరిధిలో రూ. 20,804 కోట్ల అంచనా వ్యయంతో ఎనిమిది రైల్వే మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదముద్ర పడింది.

Indian Railways (Photo Credits: Wikimedia Commons

Railway Projects: దేశంలో రైలు ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయడంతో పాటు సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) సమావేశంలో, తొమ్మిది రాష్ట్రాల పరిధిలో రూ. 20,804 కోట్ల అంచనా వ్యయంతో ఎనిమిది రైల్వే మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదముద్ర పడింది. సుమారు 1,196 కిలోమీటర్ల మేర విస్తరించే ఈ ప్రాజెక్టులను 2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ ప్రాజెక్టులను ప్రధాని గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కింద అమలు చేయనుండగా.. ఇవి రైల్వే మార్గాల్లో రద్దీని తగ్గించి, ప్రధాన పర్యాటక, పుణ్యక్షేత్రాలకు అనుసంధానాన్ని మెరుగుపరుస్తాయి.  తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. కొత్త రైల్వే లైన్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ. 10,021 కోట్లతో 540 కి.మీ.మేర ఐదు మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులు

కేంద్రం ఆమోదించిన ఎనిమిది ప్రాజెక్టుల విభజన, ముఖ్యాంశాలు:

దక్షిణాది రాష్ట్రాల ప్రాజెక్టులు (రూ. 10,021 కోట్లు - 540 కి.మీ.):

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల్లోని 17 జిల్లాల్లో ఉన్న 2,121 గ్రామాలకు (సుమారు 52 లక్షల మంది జనాభా) ఇవి లబ్ధి చేకూరుస్తాయి. వీటిలో:

సికింద్రాబాద్ (ఘట్‌కేసర్) - కాజీపేట: మల్టీట్రాకింగ్ (110 కి.మీ.)

అరక్కోణం - రేణిగుంట: 3వ, 4వ లైన్లు (77 కి.మీ.)

వైట్‌ఫీల్డ్ - బంగారపేట: 3వ మరియు 4వ లైన్లు (47 కి.మీ.)

హోసూర్ - ఓమలూర్: డబ్లింగ్ (147 కి.మీ.)

సేలం - కరూర్ - దిండిగల్: డబ్లింగ్ (159 కి.మీ.)

తూర్పు, మధ్య భారత ప్రాజెక్టులు (రూ. 10,783 కోట్లు - 656 కి.మీ.):

పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్‌గఢ్‌లలోని 14 జిల్లాల్లో ఉన్న 4,790 గ్రామాలను (56 లక్షల జనాభా) ఇవి అనుసంధానిస్తాయి. వీటిలో ఖరగ్‌పూర్ - ఝర్సుగూడ (బాగ్దేహి) 4వ లైన్, కట్ని - పేంద్ర రోడ్ 4వ లైన్, బిలాస్‌పూర్ (ఉస్లాపూర్) - పేంద్ర రోడ్ 3వ లైన్‌లు ఉన్నాయి.

ఈ మల్టీట్రాకింగ్ ప్రాజెక్టుల వల్ల ఏటా దాదాపు 74 మిలియన్ టన్నుల (MTPA) మేర అదనపు సరుకు రవాణా సామర్థ్యం పెరుగుతుంది. బొగ్గు, సిమెంట్, ఇనుము, ఎరువులు, ఆహార ధాన్యాల రవాణా సులభతరం కావడమే కాకుండా, తిరుపతి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రయాణం సుగమం కానుంది. అంతేకాకుండా, ఇంధన వినియోగం తగ్గి, కార్బన్ ఉద్గారాలు 104 కోట్ల కిలోల మేర తగ్గుతాయని, ఇది దాదాపు 4.48 కోట్ల చెట్లను నాటడంతో సమానమని ప్రభుత్వం వెల్లడించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement