India Coronavirus: దేశంలో 90 లక్షలకు చేరువలో కరోనా కేసులు, ఢిల్లీలో మళ్లీ లాక్‌డౌన్ విధించే అవకాశం లేదని తెలిపిన డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా, పెళ్లికి 50 మందికి మాత్రమే అనుమతి

దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 89 లక్షల 58 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 45,576 పాజిటివ్‌ కేసులు (India Coronavirus) నమోదు కాగా 585 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 89,58,483కు చేరగా.. మరణాల సంఖ్య 1,31,578కు (Covid Deaths) చేరింది.

India Coronavirus: దేశంలో 90 లక్షలకు చేరువలో కరోనా కేసులు, ఢిల్లీలో మళ్లీ లాక్‌డౌన్ విధించే అవకాశం లేదని తెలిపిన డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా, పెళ్లికి 50 మందికి మాత్రమే అనుమతి
Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi, November 19: దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 89 లక్షల 58 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 45,576 పాజిటివ్‌ కేసులు (India Coronavirus) నమోదు కాగా 585 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 89,58,483కు చేరగా.. మరణాల సంఖ్య 1,31,578కు (Covid Deaths) చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 4,43,303 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లోనే 44,493 మంది కోలుకోగా ఇప్పటి వరకు 83,83,602 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 93.58గా ఉండగా, మరణాల రేటు 1.47శాతానికి తగ్గింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 4.95 శాతంగా ఉంది.

దేశ రాజధానిలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ (Delhi Coronavirus) ప్రభుత్వం మరోసారి ఆంక్షలు విధించింది. లాక్‌డౌన్‌ విధించే అవకాశాలున్నాయన్న ఊహగానాలు వ్యాప్తిస్తున్నతరుణంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా స్పందించారు. ఢిల్లీలో లాక్‌డౌన్‌ విధించే అవకాశంలేదని స్పష్టం చేశారు. అయితే ఒకే ప్రదేశంలో ఎక్కువమంది గుమిగూడకుండా ఉండాలని సూచించారు. అలాగే వివాహ అతిధుల సంఖ్యను 50 మందికి పరిమితం చేసినట్టు తెలిపారు. ఇకపై గరిష్టంగా 50 మందికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. (అంతకుముందు ఇది 200గా ఉంది) ఇందుకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనుమతి లభించినట్టు వెల్లడించారు.

వ్యాక్సిన్‌పై చిగురిస్తున్న కొత్త ఆశలు, మోడెర్నా వ్యాక్సిన్ 94.5 శాతం సమర్థత ప్రదర్శించినట్లు తెలిపిన మోడెర్నా ఇంక్‌, ఫైజర్ వ్యాక్సిన్ సక్సెస్ రేటు 90 శాతం

దుకాణదారులు భయ పడాల్సిన అసరం లేదంటూ సత్యేంద్ర జైన్ భరోసా ఇచ్చారు. షాపులు తెరుచుకోవచ్చుగానీ, నిబంధనలు పాటించాలన్నారు. అలాగే ఛత్‌ పూజా సందర్బంగా పెద్ద ఎత్తున జనాలు ఒకే చోట చేరితే వైరస్ సులభంగా వ్యాప్తి చెందుతుంది అందకే ఆంక్షలు ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం బుధవారం నాటికి డిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.95 లక్షలను అధిగమించగా, దేశంలో 38,617 కొత్త కరోనావైరస్ కేసులతో మొత్తం సంఖ్య 89,12,907 కు చేరుకుంది.

ఇదిలా ఉంటే కరోనావైరస్ కేసులు పెరుగుతున్నందున బహిరంగ ప్రదేశాల్లో ఛత్ పూజ వేడుకలను నిషేధించాలన్న ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయానికి జోక్యం చేసుకోబోమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీప్రభుత్వ నిర్ణయం ప్రజల మత విశ్వాసాలను ప్రభావితం చేస్తుందంటూ దాఖలైన పిటిషన్‌ విచారించిన కోర్టు ఢిల్లీలో కరోనా పరిస్థితి గురించి తెలియదా... పూజలు చేయాలంటే మీరు సజీవంగా ఉండాలి కదా అని పిటిషనర్‌నుద్దేశించి హైకోర్టు వ్యాఖ్యానించింది.

(The above story first appeared on LatestLY on Nov 19, 2020 11:24 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).