Corbevax: భారత్‌లో తయారైన కార్బెవ్యాక్స్‌ వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్‌ఓ గుర్తింపు, ఎమర్జెన్సీ యూజ్‌ లిస్టింగ్‌ కింద టీకాను వాడుకోవచ్చని తెలిపిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

భారత్ ఫార్మా దిగ్గజం బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ (బీఇ) ఆవిష్కరించిన కొవిడ్‌ టీకా ‘కార్బెవ్యాక్స్‌’కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి అత్యవసర వినియోగ గుర్తింపు (Emergency Use Listing) లభించింది. ప్రొటీన్‌ సబ్‌-యూనిట్‌ ప్లాట్‌ఫామ్‌పై మనదేశంలో తయారైన తొలి టీకా ఇది.

Corbevax: భారత్‌లో తయారైన కార్బెవ్యాక్స్‌ వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్‌ఓ గుర్తింపు, ఎమర్జెన్సీ యూజ్‌ లిస్టింగ్‌ కింద టీకాను వాడుకోవచ్చని తెలిపిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
COVID-19 Vaccine Corbevax

భారత్ ఫార్మా దిగ్గజం బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ (బీఇ) ఆవిష్కరించిన కొవిడ్‌ టీకా ‘కార్బెవ్యాక్స్‌’కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి అత్యవసర వినియోగ గుర్తింపు (Emergency Use Listing) లభించింది. ప్రొటీన్‌ సబ్‌-యూనిట్‌ ప్లాట్‌ఫామ్‌పై మనదేశంలో తయారైన తొలి టీకా ఇది. ఈ టీకాకు గతంలోనే భారత డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ (డీసీజీఐ) అత్యవసర గుర్తింపు ఇచ్చింది.

18 ఏళ్లు మించిన వారికి ‘బూస్టర్‌ డోసు’ కింద ఈ టీకా (Biological E’s Covid vaccine Corbevax) ఇచ్చేందుకూ అనుమతి ఉంది. కేంద్రానికి ఇప్పటి వరకు 10 కోట్ల డోసుల కార్బెవ్యాక్స్‌ టీకాను బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ సరఫరా చేసింది. దేశ వ్యాప్తంగా చేపట్టిన డ్రైవ్ లో 12- 14 ఏళ్ల పిల్లల కోసం ఈ టీకాను వినియోగించారు.యోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ ఎండీ మహిమా దాట్ల ఈ టీకా గురించి మాట్లాడుతూ..‘కార్బెవ్యాక్స్‌’ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు రావడం వల్ల, ప్రొటీన్‌ సబ్‌-యూనిట్‌ ప్లాట్‌ఫామ్‌పై భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా కొవిడ్‌ టీకాలను ఆవిష్కరించే అవకాశం కలుగుతుందని అన్నారు.

భారీగా పెరిగిన కరోనా మరణాలు, డిసెంబర్ లో ఏకంగా 10వేల మంది మరణించినట్లు డబ్లూహెచ్‌వో ప్రకటన, వ్యాక్సినేషన్ పై ఆందోళన

ప్రస్తుతం ఎక్స్‌బీబీ1.5 అనే సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ వేరియంట్‌ ఆధారిత కొవిడ్‌-19 టీకాను ఆవిష్కరించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.ప్రస్తుతం వివిధ దేశాల్లో కొవిడ్‌ వ్యాప్తికి కారణమవుతున్న వైరస్‌లపై ఈ టీకా బాగా పనిచేస్తుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే దీనిపై ప్రి-క్లినికల్‌ స్థాయి జంతు ప్రయోగాలు పూర్తయ్యాయని చెప్పారు. మనదేశంలో మనుషులపైనా ప్రయోగాలు నిర్వహించేందుకు అనుమతి వచ్చిందని అన్నారు.

(The above story first appeared on LatestLY on Jan 17, 2024 12:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).