Jammu and Kashmir Encounter: పారామిలిటరీ సిబ్బందిపై ఉగ్రవాదులు దాడి, బుల్లెట్ తగిలి సీఆర్పీఎఫ్‌ అధికారి మృతి, టెర్రరిస్టులను మట్టుబెట్టేందుకు సెర్చ్ ఆపరేషన్

జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న పారామిలిటరీ సిబ్బందిపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ సంఘటనలో సీఆర్పీఎఫ్‌ అధికారికి (CRPF inspector killed in terrorist attack) బుల్లెట్‌ గాయమైంది. ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.

Jammu and Kashmir Encounter: పారామిలిటరీ సిబ్బందిపై ఉగ్రవాదులు దాడి, బుల్లెట్ తగిలి సీఆర్పీఎఫ్‌ అధికారి మృతి, టెర్రరిస్టులను మట్టుబెట్టేందుకు సెర్చ్ ఆపరేషన్
Jammu Kashmir encounter One Pakistani person has been killed

Jammu, August 19: జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న పారామిలిటరీ సిబ్బందిపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ సంఘటనలో సీఆర్పీఎఫ్‌ అధికారికి (CRPF inspector killed in terrorist attack) బుల్లెట్‌ గాయమైంది. ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. జమ్ముకశ్మీర్‌ పోలీసు బలగాలు, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌ఓజీ) సంయుక్త పార్టీపై ఉగ్రవాదులు దాడి చేశారు. సోమవారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో బసంత్‌గఢ్‌లోని మారుమూల ప్రాంతంలోని డూడు ప్రాంతంలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్‌)పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.  జాతీయ గీతం ఆలపిస్తూ గుండెపోటుతో కుప్పకూలిన రిటైర్డ్ ఆర్మీ జవాన్, విషాదకర వీడియో ఇదిగో..

కాగా, సీఆర్పీఎఫ్‌ 187వ బెటాలియన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్‌ కుల్‌దీప్‌ సింగ్‌కు బుల్లెట్‌ తగిలి గాయమైందని ఆర్మీ అధికారులు తెలిపారు. ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించినట్లు చెప్పారు. ఆ ప్రాంతానికి వెంటనే అదనపు బలగాలను రప్పించినట్లు వివరించారు. పారిపోయిన ఉగ్రవాదులను గుర్తించి మట్టుబెట్టేందుకు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు వెల్లడించారు.

(The above story first appeared on LatestLY on Aug 19, 2024 09:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).