Jharkhand Horror: అర్థరాత్రి అడవిలో యువతి బట్టలు విప్పి దారుణం, నగ్నంగా చెట్టుకు కట్టేసి వెళ్లిపోయిన ప్రియుడి తల్లిదండ్రులు, తెల్లారేవరకు యువతి బట్టలు లేకుండా అలాగే..
జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిధి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తమ కొడుకుతో ప్రేమ వ్యవహారం నడిపిందని ఓ యువతిపై అతని కుటుంబం దారుణానికి తెగబడ్డారు. అడవిలోకి తీసుకెళ్లి చితకబాది వివస్త్రురాలిని చేసి చెట్టుకు కట్టేసి వెళ్లిపోయారు.
జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిధి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తమ కొడుకుతో ప్రేమ వ్యవహారం నడిపిందని ఓ యువతిపై అతని కుటుంబం దారుణానికి తెగబడ్డారు. అడవిలోకి తీసుకెళ్లి చితకబాది వివస్త్రురాలిని చేసి చెట్టుకు కట్టేసి వెళ్లిపోయారు. పోలీసులు ఆ యువతిని రక్షించి వైద్యం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన ఆ నలుగురిలో యువతి ప్రియుడు కూడా ఉన్నట్లు తెలిపారు పోలీసులు.
బాగోడార్ షబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ నౌషాద్ అలామ్ తెలిపిన వివరాల ప్రకారం సారియా పోలీస్ స్టేషన్ పరిధిలో 26 ఏళ్ల బాధితురాలు ఒక యువకుడితో ప్రేమలో పడింది. ఈ వ్యవహారం గురించి తెలుసుకున్న అతని కుటంబసభ్యులు.. తండ్రి, తల్లి, సవతి తల్లి కుమారుడిని మందలించి ఆ యువతిని ఇంటికి రప్పించమన్నారు. వెంటనే వారి కుమారుడు ఆమెకు కబురు పంపగా బుధవారం అర్ధరాత్రి ఆమె ఇంటికి చేరుకోగానే నలుగురు కలిసి దౌర్జన్యంగా బంధించి సమీపంలోని అడవికి తీసుకుని వెళ్లారు.
అక్కడ ఆమె ప్రియుడితో సహా కుటుంబసభ్యులంతా ఏకమై ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి బట్టలను చింపివేశారని అవమానంతో ఆమె ఆత్మహత్య చేసుకుంటుందని భావించి యువతిని చెట్టుకు కట్టేసి వెళ్లిపోయారు. సంఘటనా స్థలానికి చేరుకొని బాధిత యువతిని స్థానిక ఆసుపత్రికి తరలించామని.. ఆమె ప్రియుడిని, అతడి తండ్రిని, తల్లిని, సవతి తల్లిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు తెలిపారు.
(The above story first appeared on LatestLY on Jul 28, 2023 02:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

