Rajasthan Shocker: అమ్మగారింటికి వెళ్తావా అంటూ భార్య ముక్కును కోసిన శాడిస్ట్ భర్త, రాజస్థాన్ రాష్ట్రంలో దారుణ ఘటన, పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన బాధితురాలి సోదరుడు

రాజస్థాన్ రాష్ట్రంలో దారుణ ఘటన (Rajasthan Shocker) చోటు చేసుకుంది. భార్య పుట్టింటికి వెళ్తాన‌ని భర్తను అడగడంతో అతను కోపంతో భార్య ముక్కును (Husband Cuts Wife’s Nose ) కోసేశాడు.

Rajasthan Shocker: అమ్మగారింటికి వెళ్తావా అంటూ భార్య ముక్కును కోసిన శాడిస్ట్ భర్త, రాజస్థాన్ రాష్ట్రంలో దారుణ ఘటన, పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన బాధితురాలి సోదరుడు
Crime | Representational Image (Photo Credits: Pixabay)

Jodhpur, Sep 12: రాజస్థాన్ రాష్ట్రంలో దారుణ ఘటన (Rajasthan Shocker) చోటు చేసుకుంది. భార్య పుట్టింటికి వెళ్తాన‌ని భర్తను అడగడంతో అతను కోపంతో భార్య ముక్కును (Husband Cuts Wife’s Nose ) కోసేశాడు. రాజ‌స్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. రాజస్థాన్ రాష్ట్రం లునావాస్ గ్రామానికి చెందిన భూమా రామ్‌, పూనమ్ దేవి (25) భార్యాభ‌ర్త‌లు. అయితే ఇటీవ‌ల పూన‌మ్ దేవి త‌ల్లిదండ్రుల‌కు జ్వ‌రాలు రావ‌డంతో ప‌రామ‌ర్శించి వ‌స్తాన‌ని భర్త‌ను కోరుతూ వస్తోంది.

కానీ భ‌ర్త రేపు మాపు అంటూ దాట‌వేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్ర‌వారం మ‌రోసారి పుట్టింటికి వెళ్లేందుకు భ‌ర్త అనుమ‌తి కోరింది. ఆరోజు కూడా భ‌ర్త వ‌ద్ద‌ని చెప్ప‌డంతో గొడ‌వ జ‌రిగింది. క్ష‌ణికావేశంలో భూమా ఇంట్లో కూర‌గాయ‌లు కోసే క‌త్తితో పూన‌మ్ దేవి ముక్కు కోశాడు. ఇది గ‌మ‌నించిన ఇరుగుపొరుగు వాళ్లు పూన‌మ్ దేవిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పూన‌మ్ దేవి పుట్టింటి వాళ్ల‌కు కూడా విష‌యం తెలిసిపోయింది. దాంతో ఆగ్ర‌హానికి గురైన పూన‌మ్ దేవి సోద‌రుడు ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.

అనాథని చేరదీస్తే..డబ్బు కోసం ప్రియుడితో కలిసి పెంపుడు తల్లిని చంపేసిన కసాయి కూతురు, హైదరాబాద్‌లో దారుణ ఘటన, నిందితులని అరెస్ట్ చేసిన పోలీసులు

ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయిన త‌ర్వాత‌ త‌న సోద‌రి పూన‌మ్ దేవిని తీసుకెళ్లి రాత‌పూర్వ‌కంగా కంప్లెయింట్ ఇప్పించాడు. దాంతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ప‌రారీలో ఉన్న భూమా కోసం గాలిస్తున్నారు. కాగా, భూమా త‌న సోద‌రిపై చేయి చేసుకోవ‌డం ఇదే మొద‌టిసారి కాద‌ని, చీటికిమాటికి త‌న సోద‌రిని కొట్ట‌డం అత‌నికి అల‌వాటుగా మారింద‌ని బాధితురాలు సోద‌రుడు చెప్పాడు.

(The above story first appeared on LatestLY on Sep 12, 2021 05:20 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).