Tamilnadu: లవర్‌ తిట్టిందని రూ.70 లక్షల బెంజ్‌ కారు తగుబెట్టిన యువకుడు, ప్రియురాలి ముందే బెంజ్‌కారుకు నిప్పు, ఫైరింజన్ వచ్చేలోపే బుగ్గిపాలైన కారు

లవర్స్ మధ్య గొడవ వస్తే బ్రేకప్ చెప్పుకుంటారు. కానీ తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఏకంగా రూ. 70 లక్షలు విలువ చేసే కారును తగులబెట్టాడు. తమిళనాడులోని కాంచీపురంలో ఈ ఘటన జరిగింది. వైద్య విద్య చదువుతున్న ఒక విద్యార్థి, అతడి ప్రియురాలు మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహం చెందిన అతడు సుమారు 70 లక్షల ఖరీదైన లగ్జరీ కారును తగులబెట్టాడు. తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

Tamilnadu: లవర్‌ తిట్టిందని రూ.70 లక్షల బెంజ్‌ కారు తగుబెట్టిన యువకుడు, ప్రియురాలి ముందే బెంజ్‌కారుకు నిప్పు, ఫైరింజన్ వచ్చేలోపే బుగ్గిపాలైన కారు
Fire (Representational image) Photo Credits: Flickr)

Kancheepuram, JAN 28: లవర్స్ మధ్య గొడవ వస్తే బ్రేకప్ చెప్పుకుంటారు. కానీ తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఏకంగా రూ. 70 లక్షలు విలువ చేసే కారును తగులబెట్టాడు. తమిళనాడులోని కాంచీపురంలో ఈ ఘటన జరిగింది. వైద్య విద్య చదువుతున్న ఒక విద్యార్థి, అతడి ప్రియురాలు మధ్య గొడవ (fight with girlfriend) జరిగింది. దీంతో ఆగ్రహం చెందిన అతడు సుమారు 70 లక్షల ఖరీదైన లగ్జరీ కారును తగులబెట్టాడు. తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ధర్మపురికి చెందిన 28 ఏళ్ల కవిన్‌ కాంచీపురంలోని (Kancheepuram) ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలో వైద్య విద్య చదువుతున్నాడు.

Goa New Advisory: గోవా బీచ్‌లో సెల్ఫీలు తీసుకోవడంపై ఆంక్షలు, బహిరంగంగా మందు తాగితే కఠిన చర్యలు, ఉల్లంఘిస్తే రూ. 50వేలు ఫైన్ కొత్త రూల్స్ తీసుకువచ్చిన గోవా ప్రభుత్వం! 

అదే కాలేజీలో చదివే మహిళతో కలిసి గురువారం సాయంత్రం తన మెర్సిడెస్ బెంజ్ కారులో (Mercedes-Benz car) రాజకులం గ్రామం వద్దకు వెళ్లాడు. అక్కడ వారిద్దరూ కారులో కూర్చొని మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కవిన్‌ ఆగ్రహంతో కారు నుంచి కిందకు దిగాడు. ఆ వెంటనే కారుకు నిప్పుపెట్టాడు (fire to his Mercedes-Benz).

Former Collector Fires On SI: బైకర్‌ను కొట్టిన ఎస్సై.. సారీ చెప్పించి కేసు పెట్టించిన భూపాలపల్లి మాజీ కలెక్టర్ ఆకునూరి మురళి 

మరోవైపు మంటల్లో కారు కాలిపోవడం చూసిన గ్రామస్తులు వెంటనే ఫైర్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేశారు. అయితే ఫైర్‌ ఇంజిన్‌ ఆ ప్రాంతానికి చేరుకునేలోపు సుమారు 70 లక్షల ఖరీదైన ఆ లగ్జరీ కారు పూర్తిగా కాలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Jan 28, 2023 09:07 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).