Kanjhawala Incident: ఢిల్లీ యువతి యాక్సిడెంట్ కేసులో కొత్త ట్విస్ట్, ప్రమాద సమయంలో స్కూటీపై మరో యువతి, సీసీటీవీ ఫుటేజీ పరిశీలనలో వెల్లడయిన నిజం
ఢిల్లీలో సంచలనం సృష్టించిన యువతి యాక్సిడెంట్ కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో స్కూటీపై బాధితురాలితో పాటు మరో యువతి కూడా ఉందని సీసీటీవీ ఫుటేజీ పరిశీలనలో బయటపడింది.
ఢిల్లీలో సంచలనం సృష్టించిన యువతి యాక్సిడెంట్ కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో స్కూటీపై బాధితురాలితో పాటు మరో యువతి కూడా ఉందని సీసీటీవీ ఫుటేజీ పరిశీలనలో బయటపడింది. ఓ హోటల్ జరిగిన కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొన్న స్నేహితులు ఇద్దరూ అర్ధరాత్రి దాటాక 1:45 గంటలకు స్కూటీపై బయలుదేరడం కనిపించిందని పోలీసులు చెబుతున్నారు. హోటల్ ముందున్న సీసీటీవీ కెమెరాల్లో వాళ్లు స్కూటీపై బయలుదేరడం రికార్డయిందని చెప్పారు.
ప్రమాదం జరిగిన సమయంలో అంజలితో పాటు ఆమె స్నేహితురాలు నిధి కూడా ఉందని, స్వల్ప గాయాలతో బయటపడ్డ నిధి.. భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయిందని చెప్పారు.హోటల్ దగ్గర బయలుదేరినపుడు స్కూటీని నిధి నడుపుతోందని.. మధ్యలో వాళ్లిద్దరూ తమ సీట్లు మార్చుకున్నారని వివరించారు.స్నేహితురాళ్లు ఇద్దరూ ఓ హోటల్ లో జరిగిన కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొని తిరిగొస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని చెప్పారు. నిధి జాడ కనుక్కున్నామని, ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై తనను ప్రశ్నిస్తామని పోలీసులు చెప్పారు.
Here's ANI Video
#WATCH | Kanjhawala death case: CCTV footage of that night shows the presence of another girl with the girl who died after being dragged for a few kilometres by a car that hit her in Sultanpuri area.
(CCTV visuals confirmed by police) pic.twitter.com/nd1NUBQVze
— ANI (@ANI) January 3, 2023
ప్రమాదానికి కారణమైన కారులో ఐదుగురు యువకులు ఉన్న విషయం తెలిసిందే. ప్రమాదం జరిగినపుడు తాము మద్యం మత్తులో ఉన్న విషయం నిజమేనని వాళ్లు ఒప్పుకున్నట్లు తెలిసింది. కారు కింద ఏదో చిక్కుకున్నట్లు తనకు అనిపించిందని ప్రమాద సమయంలో డ్రైవింగ్ చేస్తున్న దీపక్ ఖన్నా విచారణలో చెప్పినట్లు సమాచారం. అయితే, మిగతా నలుగురు తన మాటలను కొట్టిపారేయడంతో కారును ఆపకుండా తీసుకెళ్లినట్లు దీపక్ వివరించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఢిల్లీలోని కంఝవాలా (Delhi's Kanjhawala) ఘటనలో 20 ఏళ్ల మహిళ తన స్కూటీని కారు ఢీకొట్టడంతో ఆమెను ఆదివారం కొన్ని కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి చంపిన ఘటనలో ఐదుగురిని అరెస్టు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఔటర్ డిస్ట్రిక్ట్) హరేంద్ర కె సింగ్ తెలియజేశారు.మా దర్యాప్తు ప్రకారం, ఇది ఘోరమైన ప్రమాదం. కారులో ఉన్న మొత్తం ఐదుగురిని అరెస్టు చేశాం. వారిని ఈరోజు కోర్టులో హాజరుపరచనున్నాం. మరణించిన (Woman dies) మహిళకు పోస్ట్‌మార్టం డాక్టర్ల బోర్డు ద్వారా నిర్వహిస్తారని డీసీపీ ఏఎన్ఐకి తెలిపారు.
(The above story first appeared on LatestLY on Jan 03, 2023 11:26 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

