Kanpur Horror: ప్రేమించాడనే కోపంతో..దళితుడి మర్మాంగాలపై కర్రలతో దాడి, చెట్టుకు కట్టేసి దారుణంగా హింసించిన వైనం, యూపీలో అమానుష ఘటన, ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, మరో ఇద్దరి కోసం గాలింపు
యూపీలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించాడనే కోపంతో ఒక దళిత యువకుడి(20)పై దారుణంగా దాడి (Dalit Man Assaulted, Stick Inserted in Private Part) చేశారు. ఉత్తర ప్రదేశ్, కాన్పూర్ దేహాట్ జిల్లాలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది.
Kanpur, July 10: యూపీలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించాడనే కోపంతో ఒక దళిత యువకుడి(20)పై దారుణంగా దాడి (Dalit Man Assaulted, Stick Inserted in Private Part) చేశారు. ఉత్తర ప్రదేశ్, కాన్పూర్ దేహాట్ జిల్లాలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారం (Love Affair With Woman) కారణంగా యవకుడిని కులం అడిగి మరీ దారుణంగా దాడి చేసిన వైనం కలకలం సృష్టించింది. రెండు రోజుల క్రితం కాన్పూర్ దేహాట్ లోని అక్బర్పూర్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ అమానుషానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. తమ గ్రామంలోని అమ్మాయిని ప్రేమిస్తున్న కారణంగా కొంతమంది అతనిపై దృష్టిపెట్టారు. అమ్మాయిని కలిసేందుకు గ్రామంలోకి వచ్చిన సదరు యువకుడిని జుట్టు పట్టి లాక్కొచ్చారు. అతని కులం అడిగి మరీ కర్రలతో తీవ్రంగా కొట్టారు. మోకాళ్లతో తన్ని, కర్రలతో విపరీతంగా కొట్టారు. అంతటి ఆగలేదు. బలవంతంగా అతణ్ణి చెట్టుకు కట్టేశి ఇష్టం వచ్చినట్టుగా చితకబాదారు.
అతణ్ని పట్టుకుని మరీ మర్మాంగాలపై దాడి చేసిన వైనం వీడియోలో రికార్డైంది. తీవ్రంగా గాయపడిన అతడిని బాధితుడి బంధువులు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాగా పోలీసులు ఫిర్యాదును స్వీకరించడానికి నిరాకరించారని బాధితుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మరోవైపు ఈ వీడియో సంచలనం రేపడంతో పోలీసులు స్పందించారు. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దళిత యువకుడిపై దాడి చేసిన ముగ్గురిలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధిత యువకుడు కాన్పూర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.
(The above story first appeared on LatestLY on Jul 10, 2021 01:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

