Karan Bhushan Convoy Accident: బీజేపీ ఎంపీ కొడుకు కరణ్ కాన్వాయ్ ఢీకొని ఇద్దరు మృతి, చిక్కుల్లో బ్రిజ్‌భూషణ్‌, వీడియో ఇదిగో..

మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక ఆరోపణలతో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ (Brij Bhushan Singh) మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆయన తనయుడు కరణ్ భూషణ్‌ సింగ్‌ కాన్వాయ్‌లోని కారు వాహనదారులపైకి దూసుకెళ్లింది. దాంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గాయపడ్డారు.

Karan Bhushan Convoy Accident: బీజేపీ ఎంపీ కొడుకు కరణ్ కాన్వాయ్ ఢీకొని ఇద్దరు మృతి, చిక్కుల్లో బ్రిజ్‌భూషణ్‌, వీడియో ఇదిగో..
Screenshot of the video (Photo Credit- X/@scribe_prashant)

మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక ఆరోపణలతో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ (Brij Bhushan Singh) మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆయన తనయుడు కరణ్ భూషణ్‌ సింగ్‌ కాన్వాయ్‌లోని కారు వాహనదారులపైకి దూసుకెళ్లింది. దాంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గాయపడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండా నగర సమీపంలోని రహదారిపై ఈ ఘటన జరిగింది. దీనిపై ఫిర్యాదు నమోదైంది. తన కుమారుడు(17), సమీప బంధువు(24) బైక్‌పై బయటకు వెళ్లారని, అప్పుడే ఎదురుగా వచ్చిన కారు వారిని ఢీకొట్టిందని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. దాంతో వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. గాయపడిన మరొకరు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నట్లు చెప్పారు.  ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి?, నెటిజన్లను ప్రశ్నించిన వీసీ సజ్జనార్, అతివేగమా, నిర్లక్ష్యంగా రోడ్డు క్రాస్ చేయడమా మీరే చెప్పండి

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on May 29, 2024 07:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).