Karnataka CM Siddaramaiah: క‌ర్ణాట‌క ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్టే కుట్ర‌, ఒక్కో ఎమ్మెల్యేకు రూ 50 కోట్లు ఆఫ‌ర్ చేశార‌న్న సిద్దారామ‌య్య‌

సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ఎలాగైనా కూలగొట్టేందుకు 50 మంది ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు చొప్పున వారు ఆఫర్ చేశారు. అంత డబ్బు వారికెక్కడి నుంచి వచ్చింది. మాజీ సీఎంలు బీఎస్ యెడియూరప్ప, బస్వరాజ్ బొమ్మై, ప్రతిపక్ష నేత ఆర్ అశోక్, బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఆ సొమ్ము చెల్లిస్తున్నారా? అని ప్రశ్నించారు.

Karnataka CM Siddaramaiah: క‌ర్ణాట‌క ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్టే కుట్ర‌, ఒక్కో ఎమ్మెల్యేకు రూ 50 కోట్లు ఆఫ‌ర్ చేశార‌న్న సిద్దారామ‌య్య‌
Siddaramaiah (Photo-ANI)

Bangalore, NOV 13: తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ (BJP) పని చేస్తుందని కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య (CM Siddaramaiah) ఆరోపించారు. ఇందు కోసం 50 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు (Karnataka Congress MLA) ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఇవ్వజూపిందన్నారు. మైసూర్ జిల్లాలో ఆయన పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. తర్వాత జరిగిన బహిరంగ సభలో సిద్ధరామయ్య మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు.

Ram Gopal Varma: పవన్ కల్యాణ్, నారా లోకేశ్ పై అభ్యంతరకర పోస్టులు, రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు  

‘సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ఎలాగైనా కూలగొట్టేందుకు 50 మంది ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు చొప్పున వారు ఆఫర్ చేశారు. అంత డబ్బు వారికెక్కడి నుంచి వచ్చింది. మాజీ సీఎంలు బీఎస్ యెడియూరప్ప, బస్వరాజ్ బొమ్మై, ప్రతిపక్ష నేత ఆర్ అశోక్, బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఆ సొమ్ము చెల్లిస్తున్నారా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతల ఆఫర్‌ను తమ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంగీకరించలేదన్నారు. దీంతో తమపై కేసులు పెట్టే పనిలో బీజేపీ ఉందన్నారు.

(The above story first appeared on LatestLY on Nov 13, 2024 10:42 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).