సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. నేడు హైదరాబాద్ వెళ్లిన ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు... హైదరాబాదులోని రామ్ గోపాల్ వర్మ నివాసంలో నోటీసులు అందించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ పై అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ వర్మపై టీడీపీ మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు.
నారా లోకేష్‌ని కించపరిచేలా పోస్టులు, దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు, ఫిర్యాదు చేసిన టీడీపీ నేత
దాంతో ఆయనపై మూడ్రోజుల కింద మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఐటీ చట్టం కింద కేసు నమోదైంది. ఈ క్రమంలో, నవంబరు 19న మద్దిపాడు పీఎస్ లో విచారణకు రావాలంటూ పోలీసులు ఇవాళ నోటీసులు అందించారు. వర్మ స్వయంగా నోటీసులు అందుకున్నారు.
Notice Here
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు నోటీసులు అందించిన AP మద్దిపాడు పోలీసులు. #RGV #appolice pic.twitter.com/rfRUTTMTHf
— Aadhan Telugu (@AadhanTelugu) November 13, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)