Karnataka: దారుణం..వ్యాపార లెక్కల్లో తేడా వచ్చిందని కుమారుడికి నిప్పంటించిన తండ్రి, చికిత్స పొందుతూ బాధితుడు మృతి, నిందితుడిని అరెస్ట్ చేసిన బెంగుళూరు పోలీసులు
కర్ణాటక రాజధాని బెంగుళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. వ్యాపార లెక్కల్లో రూ.1.5 కోట్లు తేడా రావడంతో కుమారుడికి ఓ కసాయి తండ్రి (Father Allegedly Sets son on Fire) నిప్పంటించాడు. మంటలు అంటుకుని తీవ్ర గాయాలతో కుమారుడు మరణించాడు
Bengaluru, April 8: కర్ణాటక రాజధాని బెంగుళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. వ్యాపార లెక్కల్లో రూ.1.5 కోట్లు తేడా రావడంతో కుమారుడికి ఓ కసాయి తండ్రి (Father Allegedly Sets son on Fire) నిప్పంటించాడు. మంటలు అంటుకుని తీవ్ర గాయాలతో కుమారుడు మరణించాడు. వ్యాపారవేత్త అయిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాల్మీకినగర్‌కు చెందిన సురేంద్ర ఫ్యాబ్రికేషన్ వ్యాపారం చేస్తున్నాడు.
25 ఏండ్ల కుమారుడు అర్పిత్ కూడా అదే వ్యాపార వ్యవహారాలు చూస్తున్నాడు. అయితే వ్యాపార లెక్కల్లో రూ.1.5 కోట్ల మేర తేడా (Financial Issues) వచ్చింది. దీంతో దీనికి సంబంధించిన వివరాలు చెప్పాలని కుమారుడు అర్పిత్‌ను తండ్రి సురేంద్ర నిలదీశాడు. అయితే కుమారుడు లెక్కలు చెప్పకుండా దాటవేస్తూ వచ్చాడు. ఏప్రిల్ 1న ఇంటి వద్ద ఈ విషయంపై తండ్రీకొడుకుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలోనే సురేంద్ర ఆగ్రహంతో అర్పిత్‌పై పెయింట్ థిన్నర్‌ను పోశాడు.
ఘోర రోడ్డు ప్రమాదం వీడియో, బస్సును ఓవర్ టేక్ చేయబోయి మహిళ తల మీద నుంచి వెళ్లిన లారీ
నిప్పుపెట్టబోగా ఆ యువకుడు పరుగున ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అతడి వెనకే పరుగెత్తి వచ్చిన సురేంద్ర అగ్గి పుల్ల వెలిగించాడు. కుమారుడు ఎంత వేడుకున్నా ఆయన కనికరించలేదు. మొదటి సారి అగ్గిపుల్ల వెలగకపోవడంతో శాంతించని సురేంద్ర రెండోసారి అగ్గిపుల్ల గీసి అర్పిత్ మీదకు విసిరాడు. దీంతో థిన్నర్‌తో తడిసి ఉన్న అతడి దుస్తులకు మంటలు అంటుకున్నాయి. అయితే అర్పిత్ మంటలతోనే రోడ్డుపై పరుగెత్తాడు. గమనించిన స్థానికులు మంటలను ఆర్పివేశారు.
60 శాతం కాలిన గాయాలైన ఆ యువకుడ్నిస్థానికులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రెండు రోజులుగా ప్రాణాలతో పోరాడిన అర్పిత్ చికిత్స పొందుతూ గురువారం మరణించాడు. దీంతో పొరుగు ఇంటి వ్యక్తి ఫిర్యాదుతో అర్పిత్ తండ్రి సురేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
(The above story first appeared on LatestLY on Apr 08, 2022 05:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

