తెలంగాణ రాజధాని హైద‌రాబాద్‌లోని రామంత‌పూర్‌లో శుక్ర‌వారం ఉద‌యం ఘోర రోడ్డుప్ర‌మాదం సంభ‌వించింది. యాక్టివాపై వెళ్తున్న ఇద్ద‌రు దంప‌తుల‌ను వేగంగా వ‌చ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో భార్య అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌గా, భ‌ర్త‌కు తీవ్ర గాయాలయ్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఆర్టీసీ బ‌స్సు వెనుకాల ఓ లారీ వేగంగా వ‌చ్చింది. బ‌స్సును ఓవ‌ర్ టేక్ చేయ‌బోయి.. దంప‌తులు ప్ర‌యాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో మ‌హిళ తల‌పై నుంచి లారీ వెనుక టైర్లు దూసుకెళ్లాయి. ఈ క్ర‌మంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)