Karnataka Horror: కర్ణాటకలో ఘోరం, రాత్రి భోజనం పెట్టలేదని భార్య తల నరికిన భర్త, అంతటితో ఆగకుండా చర్మాన్ని ఒలిచి మృతదేహాన్ని ముక్కలు చేసిన కసాయి
కర్ణాటకలో ఘోరం చోటు చేసుకుంది. భార్య తనకు రాత్రి భోజనం పెట్టలేదన్న కోపంతో విచక్షణ కోల్పోయిన ఓ కసాయి భర్త ఆమె తలనరికి చంపేశాడు. తుముకూరు జిల్లాలో సోమవారం వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పోలీసులు గురువారం వెల్లడించారు.
కర్ణాటకలో ఘోరం చోటు చేసుకుంది. భార్య తనకు రాత్రి భోజనం పెట్టలేదన్న కోపంతో విచక్షణ కోల్పోయిన ఓ కసాయి భర్త ఆమె తలనరికి చంపేశాడు. తుముకూరు జిల్లాలో సోమవారం వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పోలీసులు గురువారం వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కునిగల్ తాలూకాకు చెందిన శివరామ, పుష్పలతకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఎనిమిదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. భార్యాభర్తలు తరచూ గొడవపడుతుండేవారు. కాగా, సోమవారం రాత్రి కూడా వారు గొడవపడ్డారు.
దాంతో ఆ రాత్రి ఆమె అతడికి భోజనం పెట్టలేదు. దీంతో, తీవ్ర ఆగ్రహంలో విచక్షణ మరిచిన శివరామ కత్తితో ఆమె తల నరికేశాడు. ఆ తరువాత రాత్రంతా ఆమె చర్మం మొత్తం ఒలిచాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ముక్కలు చేశాడు. ఘటన జరిగిన సమయంలో వారి కుమారుడు నిద్రిస్తున్నాడు. మరునాడు ఉదయం తను పని చేస్తున్న సంస్థ యజమానులకు నిందితుడు సమాచారం అందించాడు. ఏలూరులో ప్రియురాలిని కత్తితో ప్రియుడు పొడిచి చంపిన వీడియో ఇదిగో, పక్కకు పిలిచి దారుణంగా..
వారు పోలీసులకు విషయం చెప్పడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. కాగా, ఘటన స్థలిలో తమకు మహిళ మృతదేహం రక్తపు మడుగులో కనిపించిందని పోలీసులు చెప్పారు. నిందితుడు ఆమె చర్మం పూర్తిగా ఒలిచాడని తెలిపారు. నిందితుడు కూడా అక్కడే ఉన్నాడని, అతను నేరం అంగీకరించాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, నిందితుడిని అరెస్ట్ చేశారు.
(The above story first appeared on LatestLY on May 31, 2024 09:43 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

