Karnataka Shocker: కర్ణాటకలో దారుణం, ఇంటి ముందు ఆడుకుంటున్నఆరేళ్ల పాపపై తాగుబోతు అత్యాచారం, నొప్పికి విలవిలలాడుతూ చిన్నారి కేకలు

కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఆరేళ్ల బాలికపై మద్యం మత్తులో ఓ యువకుడు అత్యాచారం (Six-Year-Old Girl Raped) చేశాడు. త్రయంబకేశ్వరి నగర్‌లో ఈ ఘటన జరగ్గా, నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలిని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.

Karnataka Shocker: కర్ణాటకలో దారుణం, ఇంటి ముందు ఆడుకుంటున్నఆరేళ్ల పాపపై తాగుబోతు అత్యాచారం, నొప్పికి విలవిలలాడుతూ చిన్నారి కేకలు
Rape (Photo-IANS)

బెంగళూరు, జనవరి 30: కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఆరేళ్ల బాలికపై మద్యం మత్తులో ఓ యువకుడు అత్యాచారం (Six-Year-Old Girl Raped) చేశాడు. త్రయంబకేశ్వరి నగర్‌లో ఈ ఘటన జరగ్గా, నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలిని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. బాలిక తన ఇంటి ముందు ఒంటరిగా ఆడుకుంటుందని, ఆమె నివాసంలో ఎవరూ లేరని ఐడి హళ్లి నివాసి 23 ఏళ్ల నిందితుడు పవన్ గమనించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

చిన్నారిపై అత్యాచారం, కామాంధుడికి 20 ఏళ్ళు జైలు శిక్ష విధించిన నాంపల్లి కోర్టు, బంజారాహిల్స్‌ స్కూల్‌లో కిడ్‌పై తెగబడిన డ్రైవర్

బాలిక సహాయం కోసం కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు, బాటసారులు బాలికకు సహాయం చేసి నిందితుడి బారి నుంచి బయటికి తీసుకొచ్చారని నివేదికలు తెలిపాయి. తాగుబోతు అయిన నిందితుడు పవన్ పట్టణంలోని వీధుల్లో తిరుగుతూ ఒంటరిగా ఆడుకునే చిన్న పిల్లలను టార్గెట్ చేస్తూ ఇలాంటి మరిన్ని కేసుల్లో ప్రమేయం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సన్నిహితులు తెలిపారు. విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.

(The above story first appeared on LatestLY on Jan 30, 2024 04:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).