Makes Wine Through Youtube: య్యూట్యూబ్‌లో చూసి మద్యం తయారు చేసిన విద్యార్ధి, ఫ్రెండ్ ఇచ్చిన వైన్ తాగి ఆస్పత్రిలో పడ్డ మరో స్టూడెంట్, కేరళ గవర్నమెంట్ స్కూల్ విద్యార్ధి కక్కుర్తి, ద్రాక్ష రసంతోనే చేశా తప్పేంలేదంటున్న స్టూడెంట్

ఓ మైనర్‌ బాలుడు యూట్యూబ్‌లో చూసి మ‌ద్యం ఎలా త‌యారు చేయాలో నేర్చుకున్నాడు. నేర్చుకున్నట్లే ద్రాక్ష పండ్లతో మద్యాన్ని (wine) కూడా తయారు చేశాడు. కానీ అది బెడిసికొట్టింది. అతను తయారుచేసిన వైన్ తాగిన వ్యక్తి అనారోగ్యానికి గురయ్యాడు. కేరళలోని తిరువనంతపురం (Thiruvananthapuram) చిరాయింకీజుకు చెందిన 12 ఏళ్ల బాలుడు యూట్యూబ్​లో వీడియోలు చూసి ద్రాక్ష పండ్లతో మద్యాన్ని తయారుచేశాడు.

Makes Wine Through Youtube: య్యూట్యూబ్‌లో చూసి మద్యం తయారు చేసిన విద్యార్ధి, ఫ్రెండ్ ఇచ్చిన వైన్ తాగి ఆస్పత్రిలో పడ్డ మరో స్టూడెంట్, కేరళ గవర్నమెంట్ స్కూల్ విద్యార్ధి కక్కుర్తి, ద్రాక్ష రసంతోనే చేశా తప్పేంలేదంటున్న స్టూడెంట్
wine bottle, red wine, glass, drink

Thiruvananthapuram, July 31: చేతిలో ఫోన్ ఉంటే చాలు ఏది కావాలన్నా చేసేయొచ్చు అన్నట్లు ఉంది ఇప్పుడు లోకం తీరు. ఏది తెలియకపోయినా క్షణంలో గూగుల్‌ (Google), యూట్యూబ్‌ (YouTube)లో వెతికేస్తున్నారు. సాధారణంగా యూట్యూబ్‌ ద్వారా చాలామంది వంటలు, అల్లికలు వంటి వాటిని నేర్చుకుంటుంటారు. తాజాగా ఓ మైనర్‌ బాలుడు యూట్యూబ్‌లో చూసి మ‌ద్యం ఎలా త‌యారు చేయాలో నేర్చుకున్నాడు. నేర్చుకున్నట్లే ద్రాక్ష పండ్లతో మద్యాన్ని (wine) కూడా తయారు చేశాడు. కానీ అది బెడిసికొట్టింది. అతను తయారుచేసిన వైన్ తాగిన వ్యక్తి అనారోగ్యానికి గురయ్యాడు. కేరళలోని తిరువనంతపురం (Thiruvananthapuram) చిరాయింకీజుకు చెందిన 12 ఏళ్ల బాలుడు యూట్యూబ్​లో వీడియోలు చూసి ద్రాక్ష పండ్లతో మద్యాన్ని తయారుచేశాడు (Makes Wine). అంతేగాక ఈ వైన్​ను రుచి చూడాలని చెప్పి తన స్నేహితులకు తీసుకొచ్చి ఇచ్చాడు. ఇంకేముంది తాగిన కాసేపటికి స్నేహితుల్లోని ఓ యువకుడు అస్వస్థతకు గురయ్యాడు. వాంతులు చేసుకొని ఆస్పత్రిలో చేరాడు. కల్తీ మద్యం తాగిన బాలుడిని వెంటనే చిరాయింకీజులోని ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు వైద్యులు తెలిపారు.

Mumbai: గుజరాతీ, రాజస్థానీలను ముంబై నుంచి తరిమేస్తే మీకు ఒక్క రూపాయి కూడా మిగలదు, మరాఠీ ప్రజలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ  

ఈ ఘటన తిరువనంతపురంలోని ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసినట్లు సీనియర్‌ పోలీస్‌ అధికారి తెలిపారు. పోలీసుల విచారణలో తన తల్లిదండ్రులు కొనుగోలు చేసిన ద్రాక్ష పండ్లతోనే మద్యం తయారు చేశానని బాలుడు చెప్పాడు. అందులో ఎలాంటి రసాయనాలు కలపలేదని తెలిపాడు. యూట్యూబ్‌ లో చూపించిన విధంగా వైన్ తయారు చేసి దానిని ఒక సీసాలో నింపి.. కొన్ని గంటలు భూమిలో పాతిపెట్టినట్లు వివరించారు. ఆ తర్వాత స్నేహితుడికి ఇచ్చినట్లు చెప్పాడు.

Monkey Pox: న్యూయార్క్ ను వణికిస్తున్న మంకీ పాక్స్, 1100కు చేరువలో మంకీపాక్స్ కేసులు, గజగజ వణకుతున్న అమెరికా ప్రజలు..  

కాగా బాలుడు తయారు తయారు చేసిన వైన్ బాటిల్​ ను పోలీసులు స్థానిక కోర్టు అనుమతితో పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించారు. అయితే వైన్​ లో మరేదైనా ఆల్కహాల్ కలిపినట్లు, ఇంకేదైనా రసాయనాలు కలిపినట్లు తేలితే బాలుడిపై జువెనల్‌ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

(The above story first appeared on LatestLY on Jul 31, 2022 01:26 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).