Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Kozhikode, Sep 11: కేరళలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తిని నమ్మి ఏకంగా 300 కిలోమీటర్లు వెళ్లి అక్కడ సామూహిక అత్యాచారానికి (Woman gang-raped in Kerala) గురైంది. తన స్నేహితులతో కలిసి ఆమెపై నమ్మిన వ్యక్తి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన కేరళలోని కోజికోడ్‌లో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ కేరళలోని కొల్లాంకు చెందిని ఓ యువతి దాదాపు రెండేళ్ల క్రితం ఆన్‌లైన్‌లో కోజికోడ్‌కు చెందిన అనాస్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త స్నేహంగా మారడంతో అప్పటి నుంచి తరచూ వారు ఫోన్‌ ద్వారా మాట్లాడుకోవడం, మెసేజ్‌లు చేసుకుంటున్నారు. అయితే ఇటీవల అనాస్‌ ఆ యువతిని కోజికోడ్‌కి రావాలని బలవంతంగా చేయగా అందుకు తను అంగీకరించి (Kerala woman travels 300km ) గురువారం వెళ్లింది. అక్కడ ఆమెను రిసీవ్ చేసుకున్న ఆనాస్ ఓ ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు. అనంతరం ఆ ఫ్లాట్‌కి అతని ముగ్గురు స్నేహితులు కూడా వచ్చారు.

చికిత్స పొందుతూ ముంబై అత్యాచార బాధితురాలు మృతి, ఘటనను సీరియస్‌గా తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం, నిందితుడికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ బీజేపీ

వారందరూ కలిసి ఆ యువతి చేత బలవంతంగా మద్యం తాగించడంతో పాటు డ్రగ్స్ కూడా ఇచ్చారు. అనంతరం ఒకరి తర్వాత మరొకరు ఆమెపై అత్యాచారం చేశారు. ఆ దృశ్యాలను వీడియోతో ఫోటోలు తీసుకున్నారు. యువతి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని గ్రహించి వారు ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రి సమీపంలో వదులుతూ.. ఈ విషయాన్ని పోలీసులకు చెబితే ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరించి వెళ్లిపోయారు.అయితే ఆస్పత్రి సిబ్బంది యువతిపై జరిగిన దారుణం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాధిత మహిళ నుంచి స్టేట్‌మెంట్, నిందితుడి ఫోన్ నెంబర్ తీసుకున్నారు. ఫోన్ నెంబర్ ఆధారంగా ఆనాస్‌ను అరెస్ట చేయగా , మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.