Kolkata Doctor Rape-Murder Case: కోల్‌కతా డాక్టర్ అత్యాచారం కేసులో షాకింగ్ ట్విస్ట్, సామూహిక అత్యాచారం చేసి చంపేశారని తెలిపిన తల్లిదండ్రులు, వైద్యురాలి శరీరంలో 150 మి.గ్రా వీర్యం

కోల్‌కతాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం (Doctor Rape-Murder Case) చేసి చంపేసిన సంగతి విదితమే. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.

Kolkata Doctor Rape-Murder Case: కోల్‌కతా డాక్టర్ అత్యాచారం కేసులో షాకింగ్ ట్విస్ట్, సామూహిక అత్యాచారం చేసి చంపేశారని తెలిపిన తల్లిదండ్రులు, వైద్యురాలి శరీరంలో 150 మి.గ్రా వీర్యం
Kolkata Doctor Rape-Murder Case

Kolkata, August 15: ఈ నేపథ్యంలో ఆదివారం (ఆగస్టు 18)లోగా జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య కేసు దర్యాప్తును పూర్తి చేయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం రాత్రి సిబిఐని డిమాండ్ చేశారు.

దోషులుగా తేలిన వారిని అప్పటికి ఉరితీసేలా చూసుకోండి. “ఆదివారం నాటికి నిందితులను ఉరి తీయాలని ఒత్తిడి చేయబోతున్నాం. మన కోల్‌కతా పోలీసులు 90 శాతం విచారణ పూర్తి చేశారు. నేను ఆగస్టు 16న నిరసన కవాతుకు నాయకత్వం వహించబోతున్నాను.. తల్లులు మరియు సోదరీమణులందరూ నాతో చేరవలసిందిగా కోరుతున్నాను. దక్షిణ కోల్‌కతాలోని హజ్రా క్రాసింగ్‌లో జరిగిన బహిరంగ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మమతా ప్రసంగించారు.

కోల్‌కతాలోని ఆర్జీ కార్‌ వైద్యకళాశాల ఆస్పత్రిలో విధుల్లో ఉన్న జూనియర్‌ వైద్యురాలి (31)పై అత్యాచారం, హత్య (Kolkata Doctor Rape-Murder Case) ఘటనకు సంబంధించి షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది. హతురాలి శరీరంలో పెద్ద పరిమాణంలో 150 మిల్లీగ్రాముల వీర్యాన్ని గుర్తించినట్లు పోస్టుమార్టం నివేదిక ద్వారా వెల్లడైంది. బెంగాల్ ప్ర‌భుత్వంపై రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్, అక్క‌డ మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త క‌రువైందంటూ ఆరోప‌ణ‌

వైద్యురాలిపై హత్యాచారం కేసును సీబీఐకి అప్పగించాలంటూ హతురాలి తల్లిదండ్రులు కలకత్తా హైకోర్టును ఆశ్రయించడం... ఆ మేరకు కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. తాజాగా హైకోర్టులో వేసిన పిటిషన్‌లో హతురాలి తల్లిదండ్రులు.. పోస్టుమార్టం నివేదికలోని పలు అంశాలను పేర్కొన్నారు.

హతురాలి శరీరంలో 150 మిల్లీ గ్రాముల పరిమాణంలో వీర్యం లభించినట్లు తేలింది. ఇది వ్యక్తి ద్వారా సాధ్యం కాదు. అత్యాచార ఘటనలో ఒకరిని మించి ఉన్నారని ఈ పరిమాణం సూచిస్తోంది. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి చంపేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తమ కూతురి శరీరంలో చెవులు, మెడ, పెదవులపై తీవ్ర గాయాలున్నాయని, అత్యాచారానికి పాల్పడే క్రమంలో ఆమెపై పాశవిక దాడికి పాల్పడ్డారని, ఇదంతా ఒక్కరితో అయ్యే పని కాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. సామూహిక అత్యాచారం జరిగినట్లు పోస్టుమార్టం నివేదిక ద్వారా బలమైన ఆధారం లభించినా ఈ కేసులో మిగతా నిందితులను ఇప్పటిదాకా అరెస్టు చేయలేదని హతురాలి తల్లిదండ్రులు కోర్టు దృష్టికి తెచ్చారు. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు కేసును సీబీఐ తమ చేతుల్లోకి తీసుకుంది. నిందితుడు సంజయ్‌ రాయ్‌ని కూడా కస్టడీలోకి తీసుకుంది.

కాగా, ఈ కేసులో బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సింది పోయి.. నిందితుడిని రక్షించే ప్రయత్నాలు జరిగాయని.. ఇవి ఆస్పత్రి నిర్వాహకులు, స్థానిక యంత్రాంగం తీరుపై తీవ్ర అనుమానాలు కలిగిస్తున్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. మహిళా వైద్యులకు మెడికల్‌ కాలేజీలోనే రక్షణ లేకుండా పోతే తల్లిదండ్రులు తమ బిడ్డలను చదువుల కోసం ఇళ్ల నుంచి బయటకు ఎలా పంపగలరని ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ ఎవ్వరూ ఇలాంటి ఆలోచన చేయాలంటేనే భయపడేలా నిందితులకు కఠిన శిఽక్ష విధించాలని పేర్కొన్నారు.

మరోవైపు, హత్యాచార ఘటనలో సీఎం మమత నిందితుడి పక్షం వహిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. ఆమె వెంటనే తన సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది.

ఇదిలా ఉంటే మహిళా డాకర్ల భద్రత పేరిట అసోంలోని సిల్చార్‌ ఆస్పత్రి మెడికల్‌ కాలేజీ జారీ చేసిన అడ్వయిజరీ తీవ్ర విమర్శలకు దారితీసింది. మహిళా వైద్యులు, వైద్య విద్యార్థినులు, మహిళా సిబ్బంది నిర్మానుష్య ప్రాంతాలకు, వెలుతురు తక్కువగా ఉండే ప్రాంతాలకు, జనసంచారం లేని ప్రాంతాలకు దూరంగా ఉండాలని అడ్వయిజరీలో పేర్కొంది. ఈ అడ్వయిజరీపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అడ్వయిజరీలో వాడిన పదజాలం తమను బాధించిందని సిల్చార్‌ మెడికల్‌ కాలేజీ జూనియర్‌ డాక్టర్ల సంఘం తెలిపింది. తమను హాస్టల్‌ గదులకు పరిమితం కావాలని చెప్పే బదులు.. భద్రతా ఏర్పాట్లు మెరుగుపరచాలని కోరింది. దీంతో సిల్చార్‌ ఆస్పత్రి మెడికల్‌ కాలేజీ వెంటనే తమ అడ్వయిజరీని వెనక్కి తీసుకుంది.

(The above story first appeared on LatestLY on Aug 15, 2024 11:02 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).