LPG Price Cut: వ్యాపారస్తులకు ఊరట, 19 కేజీల సిలిండర్‌పై రూ.91.50 తగ్గింపు, తగ్గిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపిన చమురు సంస్థలు
గ్యాస్ వినియోగదారులకు దేశీయ చమురు సంస్థలు కాస్త ఉపశమనం కలిగించాయి. వాణిజ్య అవసరాలకు (Commercial gas) వినియోగించే 19 కేజీల సిలిండర్‌పై రూ.91.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. తగ్గిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని వెల్లడించాయి.
గ్యాస్ వినియోగదారులకు దేశీయ చమురు సంస్థలు కాస్త ఉపశమనం కలిగించాయి. వాణిజ్య అవసరాలకు (Commercial gas) వినియోగించే 19 కేజీల సిలిండర్‌పై రూ.91.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. తగ్గిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని వెల్లడించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో రూ.1976.07గా ఉన్న వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.1885కు తగ్గింది. ఇక ముంబైలో రూ.1844, కోల్‌కతాలో 1995.50, చెన్నైలో రూ.2045కు చేరాయి. తాజా తగ్గింపుతో హైదరాబాద్‌లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2099.5కు తగ్గింది. కాగా, గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. చివరగా జులై 6న రూ.50 పెరిగింది.
LPG Price Cut: Commercial Cooking Gas Becomes Cheaper by Up to Rs 100, Check Reduced Rates in Metro Cities#LPGprice #News #CommercialLPG #lpgcylinder https://t.co/MiFNx36p0q
— LatestLY (@latestly) September 1, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 01, 2022 02:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

