Madhya Pradesh Horror: సమోసా ఆశచూపారు, ఆరేళ్ల చిన్నారిని తాత,మామ కలిసి దారుణంగా అత్యాచారం చేశారు, ఆ తర్వాత రూ.20 ఇచ్చి ఎవరికీ చెప్పొద్దని బెదిరించారు, మధ్యప్రదేశ్‌లో దారుణ సంఘటన వెలుగులోకి..
మధ్యప్రదేశ్‌లో ఓ దారుణ సంఘటన వెలుగు (Madhya Pradesh Horror) చూసింది. ఆరేళ్ల బాలికపై సొంత మేనమామ, తాతయ్య సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. బాలికను గదిలో బంధించి సోదరుడి ముందే రాక్షసంగా ఆ చిన్నారిపై విరుచుకుపడ్డారు.
Bhopal, April 10: మధ్యప్రదేశ్‌లో ఓ దారుణ సంఘటన వెలుగు (Madhya Pradesh Horror) చూసింది. ఆరేళ్ల బాలికపై సొంత మేనమామ, తాతయ్య సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. బాలికను గదిలో బంధించి సోదరుడి ముందే రాక్షసంగా ఆ చిన్నారిపై విరుచుకుపడ్డారు. ఈ ఘటన (Grandfather, uncle gang-rape 6-year-old girl) జరిగి ఎనిమిది రోజులవ్వగా.. గురువారం వెలుగులోకి వచ్చింది. బాలిక ప్రవర్తనలో మార్పు రావడం గమనించిన తల్లి.. కూతురిని నిలదీయడంతో అసలు విషయం బయట పడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన తల్లి తన కూతురు ఎప్పటిలాగే నార్మల్‌గా కనిపించకపోడంతో ఏమైందని ప్రశ్నించింది. అయితే అమ్మ తిడుతుందని బాలిక భయపడిపోయింది. అనంతరం తల్లి గట్టిగా మందలించడంతో తనకు జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో పోలీసులను ఆశ్రయించిన బాధితురాలి తల్లి.. నిందితులపై ఫిర్యాదు చేసింది.
దీనిపై పోలీసులు మాట్లాడుతూ.. ఏడు, ఎనిమిది రోజుల ముందు బాలిక మామయ్య ఆమెను, తన మూడేళ్ల సోదరుడిని సమోసాలు కొనిస్తానని చెప్పి బంధువుల ఇంటికి తీసుకువెళ్ళారని వెల్లడించారు.
ఇద్దరూ బాలికను ఒక గదిలో బంధించి లైంగిక దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. అయితే నిందితులు మైనర్ బాలికకు రూ.20 ఇచ్చి, ఈ సంఘటన ఎవరికీ చెప్పొద్దని (give her Rs 20 to keep mum) కోరినట్లు తెలిపారు. నిందితుల్లో ఒకరు 48 ఏళ్ల తాత అని, మరొకరు మామ వరుస అయ్యే దూరపు బంధువు(20) అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులను పోక్సో యాక్ట్ కింద అరెస్టు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.
(The above story first appeared on LatestLY on Apr 10, 2021 02:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

