Nepal Flash Flood Videos: వీడియోలు ఇవిగో.. నేపాల్‌ని ముంచెత్తిన భారీ వరదలు.. భోటే కోషి నదిలో ఒక్కసారిగా పోటెత్తిన భారీ వరద.. కొట్టుకొపోయిన గ్రామాలు..
టిబెట్‌లో ప్రారంభమైన భోటే కోషి నదిలో ఒక్కసారిగా పోటెత్తిన భారీ వరదలు నేపాల్‌లోని పలు జిల్లాలను ముంచెత్తి తీవ్ర విధ్వంసం సృష్టించాయి. ఈ హఠాత్ పరిణామం వల్ల నువాకోట్, ధాడింగ్, రసువా తదితర ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
Nepal Flash Flood Videos: టిబెట్‌లో ప్రారంభమైన భోటే కోషి నదిలో ఒక్కసారిగా పోటెత్తిన భారీ వరదలు నేపాల్‌లోని పలు జిల్లాలను ముంచెత్తి తీవ్ర విధ్వంసం సృష్టించాయి. ఈ హఠాత్ పరిణామం వల్ల నువాకోట్, ధాడింగ్, రసువా తదితర ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ వరదల దాటికి నదీ పరివాహక ప్రాంతాల్లోని అనేక గ్రామాలు, స్థానిక మార్కెట్లు , వంతెనలు కొట్టుకుపోయాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం.. 1.75 లక్షలకు పైగా విదేశీ వీసాలు రద్దు.. కారణం ఏంటంటే..
విదేశీ పర్యాటకులు , స్థానికులతో కలిపి మొత్తం 384 మంది వరకు గల్లంతైనట్లు నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. గల్లంతైన వారిలో 105 మంది భారతీయ యాత్రికులు, 93 మంది నేపాలీయులు ఉన్నారు. రసువా జిల్లా పరిధిలో భద్రతా విధుల్లో ఉన్న కనీసం 26 మంది పోలీస్ సిబ్బంది జాడ కూడా లభించడం లేదు. వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో పరివాహక ప్రాంతాల్లోని పలు జలవిద్యుత్ కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
దీంతో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితుల తీవ్రతపై నేపాల్ ప్రధాని బాలేంద్ర షా నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. బాధితులకు తక్షణ సహాయం అందించడానికి ప్రత్యేక వైద్య బృందాలను, సైనిక హెలికాప్టర్లను , విపత్తు నివారణ రెస్క్యూ టీమ్‌లను రంగంలోకి దించారు.
Nepal Flash Flood Videos:
నేపాల్ భయపెట్టిన ఆకస్మిక వరద
నేపాలీ మీడియా కథనాల ప్రకారం.. ఇప్పటివరకు 32 మంది పోలీసులు, 25 మంది యాత్రికులతో సహా పెద్ద సంఖ్యలో ప్రజలు గల్లంతైనట్టు సమాచారం
హెలికాప్టర్ల ద్వారా 12 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్ pic.twitter.com/rUbo5Pv49m
— Telugu Feed (@Telugufeedsite) August 26, 2026
Today, a devastating sudden surge in the Bhotekoshi River has caused widespread destruction, with fears that several people may have been killed or swept away. 📍Rasuwa District, Nepal, along the China border. pic.twitter.com/52if8LGlO9
— Weather Monitor (@WeatherMonitors) August 26, 2026
దక్షిణాసియా ప్రాంతంలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు కురిసే రుతుపవనాల సమయంలో ప్రతికూల వాతావరణం, వాతావరణ మార్పుల (Climate Change) కారణంగా ఇటువంటి ఆకస్మిక వరదలు , కొండచరియలు విరిగిపడే ప్రమాదాలు పెరిగిపోతున్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు వ్యక్తపరుస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Aug 26, 2026 05:03 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

