Madhya Pradesh Shocker: వైరల్ వీడియో, టోల్ ఫీజు చెల్లించమన్నందుకు మహిళపై చేయి చేసుకున్న కారు డ్రైవర్, ఎదురు తిరిగి అతడ్ని చెప్పుతో కొట్టిన మహిళ, సోషల్ మీడియాలో వైరల్
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో టోల్ రుసుం చెల్లించాలని అడిగిన టోల్ బూత్ మహిళా ఉద్యోగిని ఒక వ్యక్తి చెంప దెబ్బ కొట్టాడు. దీంతో ఆమె కూడా ఎదురు తిరిగి అతడ్ని చెప్పుతో కొట్టింది. రాజ్‌గఢ్-భోపాల్ రహదారిలోని కచ్నారియా టోల్ ప్లాజాకు రాజ్ కుమార్ గుర్జార్ అనే వ్యక్తి కారులో వచ్చాడు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో టోల్ రుసుం చెల్లించాలని అడిగిన టోల్ బూత్ మహిళా ఉద్యోగిని ఒక వ్యక్తి చెంప దెబ్బ కొట్టాడు. దీంతో ఆమె కూడా ఎదురు తిరిగి అతడ్ని చెప్పుతో కొట్టింది. రాజ్‌గఢ్-భోపాల్ రహదారిలోని కచ్నారియా టోల్ ప్లాజాకు రాజ్ కుమార్ గుర్జార్ అనే వ్యక్తి కారులో వచ్చాడు. అయితే అతడి వాహనానికి ఫాస్టాగ్ లేదు. దీంతో టోల్ ట్యాక్స్ కట్టాలని అక్కడి మహిళా ఉద్యోగిని అనురంద డాంగి అడిగింది.
వెంటనే కారు దిగి వచ్చి మహిళా ఉద్యోగిని చెంపపై కొట్టాడు. అయితే ఆమె కూడా ఎదురు తిరిగింది. తన కాలి చెప్పుతో అత్నడి కొట్టింది. దీంతో అతడు మరింతగా రెచ్చిపోయి ఆమెపై దాడి చేశాడు. మహిళా ఉద్యోగిని అనురంద ఫిర్యాదుతో పోలీసులు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అతడ్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఆ టోల్ ప్లాజా వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A man slapped a woman employee of a toll both in Rajgarh after she refused to let him go without paying the tax. The man is seen angrily walking towards the employee and then slapping her across the face, The woman hits him back with her footwear @ndtv @ndtvindia pic.twitter.com/hmK0ghdImX
— Anurag Dwary (@Anurag_Dwary) August 21, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 22, 2022 01:31 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

