Maharashtra: భార్యకు చీర కట్టుకోవడం రాలేదని భర్త ఆత్మహత్య, సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న ఔరంగాబాద్‌ పోలీసులు

మహారాష్ట్రలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తన భార్య చీర సరిగా కట్టుకోలేక పోవడంతో ఆ యువకుడు ఆత్మహత్య మార్గాన్ని (Maharashtra man committed suicide) ఎంచుకున్నాడు. ఈ విషయాన్ని అతడు సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో సోమవారం చోటుచేసుకుంది.

Maharashtra: భార్యకు చీర కట్టుకోవడం రాలేదని భర్త ఆత్మహత్య, సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న ఔరంగాబాద్‌ పోలీసులు
Representational Image (Photo Credits: File Image)

Mumbai, May 17: మహారాష్ట్రలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తన భార్య చీర సరిగా కట్టుకోలేక పోవడంతో ఆ యువకుడు ఆత్మహత్య మార్గాన్ని (Maharashtra man committed suicide) ఎంచుకున్నాడు. ఈ విషయాన్ని అతడు సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో సోమవారం చోటుచేసుకుంది.

వివరాల్లోకెళ్తే... మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలో 24 ఏళ్ల వ్యక్తి ఆరునెలల క్రితమే పెళ్లి చేసుకున్నాడు. ఐతే ఆ మహిళ అతని కంటే ఆరేళ్లు పెద్దది. కానీ ఆమెకు చీర కట్టుకోవడం, మాట్లాడటం, నడవటం సరిగా రాదు. దీంతో అసంతృప్తి చెందిన ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. పైగా సూసైడ్‌ నోట్‌లో తన భార్యకు చీరకట్టుకోవడం రాదనే (wife cannot drape saree) చనిపోతున్నానని పేర్కొనడం గమనార్హం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు సోమవారం సామల్ ఇంటి నుంచి అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతని ఇంటి నుంచి సూసైడ్ నోట్ కూడా స్వాధీనం చేసుకున్నారు.

(The above story first appeared on LatestLY on May 17, 2022 08:11 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).