Maharashtra: కామాంధుడి నుంచి తప్పించుకునేందుకు ఎయిడ్స్ ఉందంటూ మహిళ నాటకం, అయినా వదలకపోవడంతో రక్తం కక్కుకుంటూ..

ఓ కామాంధుడి నుంచి తన శీలాన్ని కాపాడుకునేందుకు ముంబైలో ఓ యువతి చేయకూడని సాహం చేసింది. ముసుగు ధరించిన యువకుడు తనపై అత్యాచారం చేయబోగా ఎయిడ్స్ ఉందని నటించి తప్పించుకుంది. ఈ విషయాన్ని ఆ ముంబై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Maharashtra: కామాంధుడి నుంచి తప్పించుకునేందుకు ఎయిడ్స్ ఉందంటూ మహిళ నాటకం, అయినా వదలకపోవడంతో రక్తం కక్కుకుంటూ..
Credits: Google

Mumbai, August 22: ఓ కామాంధుడి నుంచి తన శీలాన్ని కాపాడుకునేందుకు ముంబైలో ఓ యువతి చేయకూడని సాహం చేసింది. ముసుగు ధరించిన యువకుడు తనపై అత్యాచారం చేయబోగా ఎయిడ్స్ ఉందని నటించి తప్పించుకుంది. ఈ విషయాన్ని ఆ ముంబై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే, బోరీవలీ ప్రాంతంలో 53 ఏళ్ల ఓ మహిళ ఒంటరిగా నివసిస్తోంది. ఆమె భర్త కొంతకాలం క్రితం మరణించారు. కూతురు, అల్లుడు విదేశాల్లో నివసిస్తుంటారు. స్థానికంగా ఉన్న ఓ భవంతి గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఆమె ఉంటోంది.

ఇటీవల ఓ రోజు రాత్రి 2.00 గంటల సమయంలో ఆమె నిద్రపోతుండగా సుమారు 25 ఏళ్ల వయసున్న ఓ ఆగంతుకుడు కిటికీ గ్రిల్స్ తొలగించి ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. మహిళకు మెలకువ రావడంతో ఎందుకొచ్చావంటూ ఆ ఆగంతుకుడిని ప్రశ్నించింది. దొంగతనానికి వచ్చానని అతడు సమాధానం ఇవ్వడంతో ఆమె నిర్ఘాంతపోయింది.

సుప్రీంకోర్టు సంచలన తీర్పు, అత్యాచార బాధితురాలి ప్రెగ్నెన్సీ తొలగించుకునేందుకు అనుమతి

అయితే, అతడు ఆమెపై లైంగిక వేధింపులకు దిగడంతో తనకు ఎయిడ్స్ ఉందని నటిస్తూ అతడి ముందు రక్తం కక్కుకుంది. దీంతో, భయపడిపోయిన నిందితుడు ఇంటి ప్రధాన ద్వారం గుండా వెళ్లిపోతూ, బయట గడియపెట్టేశాడు. దీంతో ఆమె పోరుగువారిని పిలిచి తలుపు తీయించుకుంది. ఈ మేరకు బాధితురాలు మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించామని మీడియాకు తెలిపారు. ఆ భవంతిలో వాచ్‌మెన్ ఎవరూ లేరని, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలు కూడా పనిచేయట్లేదని చెప్పారు. పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఇరుగుపొరుగును ప్రశ్నిస్తున్నట్టు తెలిపారు.

(The above story first appeared on LatestLY on Aug 22, 2023 11:06 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).