సుప్రీంకోర్టు(Supreme Court) గ‌ర్భ‌వ‌తి అయిన ఓ అత్యాచార బాధితురాలికి ఊర‌ట క‌ల్పించింది. ప్రెగ్నెన్సీని తొల‌గించుకునేందుకు సుప్రీంకోర్టు ఆమెకు అనుమ‌తి ఇచ్చింది. భార‌తీయ స‌మాజంలో వివాహ వ్య‌వ‌స్థ‌కు ప్ర‌త్యేక స్థానం ఉంద‌ని, గ‌ర్భాన్ని దాల్చ‌డం దంప‌తుల‌కు సంతోష‌క‌ర‌మైన అంశ‌మ‌ని, స‌మాజానికి కూడా అది మంచి సంకేతాన్ని ఇస్తుంద‌ని, కానీ వివాహం కాని వారు గ‌ర్భాన్ని దాల్చ‌డం వ‌ల్ల అది ఆ మ‌హిళ మాన‌సిక ఆరోగ్యంపై ప్ర‌భావం ప‌డుతుంద‌ని కోర్టు త‌న తీర్పులో తెలిపింది.

ఈ కేసులో ఆగ‌స్టు 20లోగా వైద్య నివేదిక ఇవ్వాల‌ని గ‌త విచార‌ణ‌లో సుప్రీంకోర్టు పేర్కొన్న‌ది. గ‌ర్భాన్ని తొల‌గించుకునేందుకు అనుమ‌తి నిరాక‌రించిన గుజ‌రాత్ హైకోర్టు తీర్పును కూడా సుప్రీంకోర్టు త‌ప్పుప‌ట్టింది. ఇలాంటి కేసుల్లో కొంత వేగాన్ని చూపాల‌ని సుప్రీం అభిప్రాయ‌ప‌డింది. నిర్ల‌క్ష్య‌పూరిత వైఖ‌రి స‌రికాదు అని అత్యున్న‌త న్యాయ‌స్థానం తెలిపింది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)