Mass Suicide In Delhi: ఢిల్లీలో ఘోరం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు విగతజీవులుగా.. తండ్రి, నలుగురు కుమార్తెల ఆత్మహత్య
దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు విగతజీవులుగా కనిపించారు. బీహార్ నుంచి కుటుంబంతో సహా నగరానికి వలసవచ్చిన ఓ వ్యక్తి దివ్యాంగులైన తన నలుగురు కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. రంగపురి ప్రాంతంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
Newdelhi, Sep 28: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) ఘోరం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు విగతజీవులుగా కనిపించారు. బీహార్ (Bihar) నుంచి కుటుంబంతో సహా నగరానికి వలసవచ్చిన ఓ వ్యక్తి దివ్యాంగులైన తన నలుగురు కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. రంగపురి ప్రాంతంలో ఈ విషాదం చోటుచేసుకుంది. వారందరూ విషం తాగి మరణించినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గత మూడు రోజుల నుంచి ఇంటి నుంచి దుర్వాసన వస్తుందంటూ చుట్టుపక్కల వారు పోలీసులకు ఫోన్ చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఐదుగురి మృతదేహాలు ఒకదాని పక్కన ఒకటి పడి వున్నాయి.
Man, 4 Daughters Found Dead At Delhi Home, Cops Suspect Murder-Suicide https://t.co/2DpYpvYyIF pic.twitter.com/GImjPhuutu
— NDTV News feed (@ndtvfeed) September 28, 2024
కొన్నినెలల క్రితం తల్లి..
వసంత్ కుంజ్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తండ్రి కార్పెంటర్ గా పనిచేస్తున్నట్టు సమాచారం. పిల్లల తల్లి కొన్నేళ్ల క్రితమే క్యాన్సర్ తో మరణించింది. అయితే, వీరి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
(The above story first appeared on LatestLY on Sep 28, 2024 11:02 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

