AV Ranganath (Credits: X)

Hyderabad, Sep 28: సహజ నీటి వనరులను అక్రమంగా చెరపట్టిన అక్రమార్కులపై పంజా విసురుతూ హైద‌రాబాద్ (Hyderabad) న‌గ‌ర వ్యాప్తంగా అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ హైడ్రా (HYDRA) ఈమధ్య తరుచూ వార్తల్లో నిలుస్తున్నది. అయితే, కూక‌ట్‌ ప‌ల్లి ప‌రిధిలోని యాద‌వ బ‌స్తీకి చెందిన గుర్రంప‌ల్లి బుచ్చ‌మ్మ అనే మ‌హిళ హైడ్రా తమ ఇంటిని ఎక్కడ కూల్చివేస్తదో అన్న భ‌యంతో బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది. హైడ్రా కారణంగానే బుచ్చ‌మ్మ బలవన్మరణానికి పాల్పడినట్టు పలువురు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ స్పందించారు. బుచ్చ‌మ్మ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదు అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య.. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఘటన

అసలేం జరిగింది?

శివ‌య్య‌, బుచ్చ‌మ్మ దంప‌తులు త‌మ ముగ్గురు కూతుళ్ల‌కు పెళ్లిళ్లు చేసి, క‌ట్నంగా కూక‌ట్‌ ప‌ల్లి ప‌రిధిలోని యాద‌వ బ‌స్తీలో ఉన్న త‌లో ఇల్లును రాసిచ్చారు. అయితే, చెరువుల ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో నిర్మించిన ఇళ్ల‌ను హైడ్రా కూల్చివేస్తోంది. ఈ విష‌యం తెలిసి త‌మ బిడ్డ‌ల‌కు ఇచ్చిన ఇళ్లు కూల్చివేస్తార‌నే మ‌న‌స్తాపంతో త‌ల్లి బుచ్చ‌మ్మ ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు స‌మాచారం. దీనిపై మీడియా హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ ను ప్రశ్నించింది.

పర్యాటక ప్రాంతాలుగా చారిత్రాత్మక భవనాలు,సంక్షేమంతో పాటు పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకువెళ్తామన్న సీఎం రేవంత్ రెడ్డి

స్పందించిన‌ 'హైడ్రా' క‌మిష‌న‌ర్..

ఈ ఘ‌ట‌న‌పై హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ స్పందించారు. బుచ్చ‌మ్మ బ‌ల‌వ‌న్మ‌ర‌ణంపై కూక‌ట్‌ ప‌ల్లి పోలీసుల‌తో మాట్లాడిన‌ట్లు తెలిపారు. హైడ్రా కూల్చివేత‌ల్లో భాగంగా త‌మ ఇళ్ల‌ను కూలుస్తార‌నే భ‌యంతో వారి కూతుర్లు ఆమెను ప్ర‌శ్నించారు. దాంతో బుచ్చ‌మ్మ మ‌న‌స్తాపానికి గురై ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌తో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదు అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.