Man Bites Friends Neck: మద్యం మత్తులో స్నేహితుడి రక్తం తాగేందుకు మెడకొరికిన వ్యక్తి, నా రక్తం తాగాలనుకుంటున్నావా? నిన్ను బతుకనివ్వను అంటూ ఎదురుదాడి చేసి హత్య

రాహుల్ లోహర్ అనే వ్యక్తి ఫ్రెండ్స్‌తో కలిసి మద్యం (Drink) తాగాడు. అయితే స్నేహితుడైన ఇష్తియాక్ ఖాన్ మద్యం మత్తులో రాహుల్‌ రక్తం తాగుతానని అన్నాడు. అంతేగాక అతడి మెడను కొరికాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఫైట్‌ జరిగింది. అనంతరం రాహుల్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

Man Bites Friends Neck: మద్యం మత్తులో స్నేహితుడి రక్తం తాగేందుకు మెడకొరికిన వ్యక్తి, నా రక్తం తాగాలనుకుంటున్నావా? నిన్ను బతుకనివ్వను అంటూ ఎదురుదాడి చేసి హత్య
Representational Purpose Only (File Image)

Mumbai, Aug 05: రక్తం తాగుతానంటూ ఒక వ్యక్తి స్నేహితుడి మెడ కొరికాడు. (Man bites friend’s neck) దీంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. అయితే నా రక్తం తాగుతావా అంటూ ఆగ్రహించిన స్నేహితుడు ఆ తర్వాత ఆ వ్యక్తిని హత్య చేశాడు. మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాహుల్ లోహర్ అనే వ్యక్తి ఫ్రెండ్స్‌తో కలిసి మద్యం (Drink) తాగాడు. అయితే స్నేహితుడైన ఇష్తియాక్ ఖాన్ మద్యం మత్తులో రాహుల్‌ రక్తం తాగుతానని అన్నాడు. అంతేగాక అతడి మెడను కొరికాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఫైట్‌ జరిగింది. అనంతరం రాహుల్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

Chhattisgarh Shocker: భర్తను చంపి శవం పక్కనే భార్యను రేప్‌ చేసిన కిరాతకుడు, చత్తీస్‌గఢ్‌లో వెలుగుచూసిన దారుణ ఘటన 

కాగా, కొంతసేపటి తర్వాత రాహుల్‌ తిరిగి ఇష్తియాక్ ఖాన్‌ను కలిశాడు. ‘నా రక్తం తాగాలనుకుంటున్నావా? నిన్ను బతుకనివ్వను’ అంటూ అతడిపై దాడి చేశాడు. ఇష్తియాక్ తలను బండరాయితో మోది హత్య చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడు రాహుల్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Aug 05, 2023 09:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).