UP Shocker: రూ.20 ఇచ్చి బాలుడిపై అత్యాచారానికి పాల్పడిన మైనర్లు, మరో చోట మైనర్ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన మహిళ, గర్భవతినంటూ పోలీసులకు తెలిపిన లేడీ, నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మైనర్లు కలిసి ఓ 13 ఏండ్ల బాలుడిపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాలోని (UP’s Aligarh) లోధా ఏరియాకు చెందిన ఓ వ్యక్తి తన కుమారుడికి డబ్బులిచ్చి మార్కెట్‌కు పంపాడు. ఆ బాలుడిని అనుసరించిన మరో ఇద్దరు మైనర్లు కలిసి, అతన్ని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు.
Lucknow, Mar 7: యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మైనర్లు కలిసి ఓ 13 ఏండ్ల బాలుడిపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాలోని (UP’s Aligarh) లోధా ఏరియాకు చెందిన ఓ వ్యక్తి తన కుమారుడికి డబ్బులిచ్చి మార్కెట్‌కు పంపాడు. ఆ బాలుడిని అనుసరించిన మరో ఇద్దరు మైనర్లు కలిసి, అతన్ని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు.
అక్కడ బాలుడిపై లైంగికదాడికి (Minors sexually assault 13-year-old boy) పాల్పడ్డారు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించి, రూ. 20 ఇచ్చారు. బాధిత బాలుడు తన ఇంటికొచ్చి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఇద్దరు తమ కుటుంబానికి బాగా తెలిసిన వాళ్లేనని, పిల్లాడి పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారని (sexual assault in Aligarh) ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గురువారం జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇక యుఎస్లో ఒక మహిళ 14 ఏండ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడింది. కొంత కాలంగా అతడితో శృంగారంలో పాల్గొన్న ఆమె రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆమె ఆ బాలుడి ద్వారా గర్భం దాల్చింది. అమెరికాలోని ఆర్కాన్సాస్‌లో ఈ ఘటన జరిగింది. బ్రిట్నీ గ్రే అనే మహిళ ఏడాదిగా 14 ఏండ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడింది. గత ఏడాది సెప్టెంబర్‌లో దీనిని ప్రత్యక్షంగా చూసిన ఒక వ్యక్తి, పిల్లల హాట్‌లైన్‌కు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఆ బాలుడితో శృంగారం ద్వారా బ్రిట్నీ గ్రే గర్భం దాల్చినట్లు ఆ ప్రత్యక్ష సాక్షి పోలీసులకు తెలిపాడు. పోలీసులు కూడా ఈ విషయాన్ని నిర్ధారించుకున్నారు. ఈ నెల 1న గ్రేను అరెస్ట్ చేశారు. ఆమె 5 వేల డాలర్ల బాండు సమర్పించడంతో గురువారం విడుదల చేశారు. ఏప్రిల్ 23న కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతుందని, అప్పుడు ఆమె హాజరుకావాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు.
(The above story first appeared on LatestLY on Mar 07, 2021 05:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

