Monsoon Session: ఇకపై కొత్తగా జననాలు, మరణాల నమోదుకు ఆధార్ కార్డు తప్పనిసరి, జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు-2023కి లోక్‌సభ ఆమోదం
లోక్‌సభ మంగళవారం జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు, 2023ని ఆమోదించింది. 1969 నాటి జనన మరణాల నమోదు చట్టానికి సవరణలు చేస్తూ కేంద్రం పార్లమెంటు ముందుకు తీసుకొచ్చిన సవరణ బిల్లుకుచర్చల అనంతరం లోక్‌సభ ఆమోదం తెలిపింది.
Lok Sabha passes Registration of Births and Deaths Bill: లోక్‌సభ మంగళవారం జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు, 2023ని ఆమోదించింది. 1969 నాటి జనన మరణాల నమోదు చట్టానికి సవరణలు చేస్తూ కేంద్రం పార్లమెంటు ముందుకు తీసుకొచ్చిన సవరణ బిల్లుకుచర్చల అనంతరం లోక్‌సభ ఆమోదం తెలిపింది. పాత చట్టానికి పలు సవరణలు చేస్తూ కొత్తగా రూపొందించిన జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు-2023ను కేంద్రం జూలై 26న లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
సవరించిన బిల్లు ప్రకారం.. ఏదైనా కుటుంబంలో కొత్తగా జననాలు, మరణాల నమోదుకు ఆధార్ తప్పనిసరి కానుంది. 1969 నాటి జనన, మరణాల నమోదు చట్టం ప్రకారం ఆధార్ తప్పనిసరి కాదు. అంతేగాక కొత్త చట్టం అమల్లోకి వస్తే రిజిస్టర్డ్ జననాలు, మరణాల డేటాను రాష్ట్రాలు తప్పనిసరిగా ఎప్పటికప్పుడు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (RGI) తో పంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రాలు ప్రతి ఏడాది వార్షిక గణాంక నివేదికలను మాత్రమే RGIకి పంపుతున్నాయి.
ఆ మహిళలను పోలీసులే కామాంధులకు అప్పగించినట్లుంది, మహిళల నగ్న వీడియో ఘటనపై మండిపడిన సుప్రీంకోర్టు
1969 నాటి జనన, మరణాల నమోదు చట్టం ప్రకారం జనన ధృవీకరణ పత్రం అనేది కేవలం వయసును తెలియజేసే సర్టిఫికెట్ మాత్రమే. కానీ ఇప్పుడు పాఠశాలల్లో ప్రవేశాలకు, ఓటరుగా నమోదు చేసుకోవడానికి, వివాహాలకు, పాస్‌పోర్టుల జారీకి, ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తులకు జనన ధృవీకరణ పత్రాలను తప్పనిసరి చేయాలని బిల్లు ప్రతిపాదిస్తోంది.
(The above story first appeared on LatestLY on Aug 01, 2023 05:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

