MP Shocker: భర్త శృంగారానికి పిలిచినందుకు.. నన్నే పిలుస్తావా అంటూ పురుషాంగాన్ని కత్తితో కోసేసిన భార్య, మధ్యప్రదేశ్‌లోని టికామ్‌ఘడ్ పట్టణంలో దారుణం, నిందితురాలు అరెస్ట్
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ భర్త తన భార్యను శృంగారం కోసం (MP woman angry with forced sex) పిలిస్తే ఆ భార్య కత్తితో దాడి చేసింది.
Tikamgarh, Dec 14: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ భర్త తన భార్యను శృంగారం కోసం (MP woman angry with forced sex) పిలిస్తే ఆ భార్య కత్తితో దాడి చేసింది. తనతో శృంగారంలో పాల్గొనమని బలవంతం చేశాడని ఆ భార్య 26 ఏళ్ల భర్త జననాంగాలను (cuts off husband's genitals) కోసేసింది.ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని టికామ్‌ఘడ్ పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టికామ్‌ఘడ్ పట్టణానికి చెందిన 24 ఏళ్ల మహిళ 26 ఏళ్ల వ్యక్తిని 2019వ సంవత్సరంలో వివాహం చేసుకుంది.
భార్యాభర్తల మధ్య ఏర్పడిన గొడవల కారణంగా ఇంతకు ముందు వీరు వేర్వేరుగా ఉన్నారు. అయితే భార్యాభర్తలు గత కొంత కాలంగా కలిసి నివాసం ఉంటున్నారు. తన ఇష్టానికి విరుద్ధంగా భర్త తనతో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నించాడనే కోపంతో భార్య అతని జననాంగాన్ని కోసిందని జాతర పోలీసు స్టేషన్ అధికారి త్రివేంద్ర త్రివేది చెప్పారు.
ఈ దారుణ ఘటన డిసెంబరు 7వతేదీన జరిగినా, భర్తకు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి రావడంతో ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వంటగదిలో కత్తితో భర్త జననాంగాన్ని కోసిన భార్యపై ఐపీసీ సెక్షన్ 324 కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
(The above story first appeared on LatestLY on Dec 14, 2021 02:58 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

