Mumbai Shocker: వంట రుచిగా వండలేదని స్నేహితుడిని చంపేశాడు, పారతో గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే యువకుడు మృతి, గొడవను ఆపటానికి వచ్చిన మరో వ్యక్తిపై కూడా నిందితుడు దాడి, ముంబైలో షాకింగ్ ఘటన
మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆహారం విషయంలో జరిగిన గొడవ స్నేహితుడి ప్రాణాన్ని (Labourer Kills Friend) తీసింది. నకు నచ్చినట్లుగా వంట రుచిగా వండలేదని పారతో స్నేహితుడిని మరో స్నేహితుడు కొట్టి (Dispute Over Food in Dahisar) చంపేశాడు.
Mumbai, March 4: మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆహారం విషయంలో జరిగిన గొడవ స్నేహితుడి ప్రాణాన్ని (Labourer Kills Friend) తీసింది. నకు నచ్చినట్లుగా వంట రుచిగా వండలేదని పారతో స్నేహితుడిని మరో స్నేహితుడు కొట్టి (Dispute Over Food in Dahisar) చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబైకి చెందిన 27 ఏళ్ల వ్యక్తి మరో స్నేహితుడితో కలిసి దహిసర్ ఏరియాలోని ఓ కన్‌స్ట్రక్షన్ సైట్‌లో పని చేస్తున్నాడు.
మంగళవారం వంట విషయంలో ఇద్దరికీ గొడవైంది. తనకు నచ్చిన విధంగా వంట చేయలేదంటూ నిందితుడు.. బాధితుడిపై గొడవకు దిగాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్యా వాగ్వివాదం చోటుచేసుకుంది. ఒకరినొకరు బూతులు తిట్టుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నిందితుడు.. బాధితుడి తలపై పారతో గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
గొడవను ఆపటానికి వచ్చిన మరో వ్యక్తిపై కూడా నిందితుడు దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
"మేము నిందితులను అరెస్టు చేసాము మరియు అతనిపై 302 (హత్య) తో సహా వివిధ భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ల కింద కేసు నమోదు చేసాము" అని దాహిసర్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ పాటిల్ చెప్పారు.
(The above story first appeared on LatestLY on Mar 04, 2021 05:12 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

